ఇదో ట్విస్ట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పేసిన దేవే గౌడ..!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటిదాకా ప్రతి సర్వేలోనూ జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ అవుతుందనే తెలిపాయి. ఆ పార్టీ మద్దతు ఇస్తే కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తాము భారతీయ జనతా పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు దేవేగౌడ.

ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. అయితే, ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిల్ అలీ తెలిపారు.

ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే.. అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా’’ అని పేర్కొన్నారు. జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని, ఎవరి మద్దతు తమకు అవసరం లేదన్న ధీమాతో సిద్ధరామయ్య ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు రోజులు సేదతీరమని కాంగ్రెస్ కార్యకర్తలకు సిద్ధరామయ్య సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here