రియల్ ‘దంగల్ సిస్టర్ల’ పై వేటు..!

దంగల్ సినిమా.. భారత్ లో దుమ్ముదులిపేసిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ లో గీతా సింగ్ ఫోగాట్, బబితా లను ఆమె తండ్రి ఎలా తీర్చిదిద్దాడన్నది ఆ చిత్ర కథాంశం. అయితే ఇప్పుడు వారిని బహిష్కరిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేటు వేసింది. ఫోగాట్ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్ళకు వేటు విధించారు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేషనల్ క్యాంపుకు వీళ్లు హాజరుకాకపోవడంపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేశారు. ఈ ఇద్దరితో పాటు వారి చెల్లెళ్లు రీతూ, సంగీతాలను కూడా నేషనల్ క్యాంపు నుంచి బహిష్కరించింది ఫెడరేషన్. నేషనల్ క్యాంపుకు ఎంపికైన అందరు రెజ్లర్లందరూ మూడు రోజుల్లోపు వ్యక్తిగతంగా హాజరు అవ్వాలి లేదంటే సమాచారం ఇవ్వాలి. గీత, బబితా ఏ సమాచారం ఇవ్వకుండా గైర్హాజరవ్వడంతో వారిపై వేటు వేసినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ తెలిపారు. బబిత, గాయం కారణంగానే క్యాంప్‌కు వెళ్లలేకపోయానని చెప్పింది. ఈ వివరణను ఫెడరేషన్ ఇస్తానని స్పష్టం చేసింది.

నేషనల్ క్యాంప్ నుంచి బహిష్కరించారంటే ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా వాళ్లు కోల్పేయే అవకాశం ఉంది. అయితే వారు సంతృప్తికర వివరణ ఇవ్వగలిగితే మళ్లీ నేషనల్ క్యాంపును అనుమతించే అవకాశం ఉందని బ్రిజ్ భూషన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here