మనం ఎంత ద్రోహం చేస్తున్నామో తెలుసొచ్చే ఘటన ఇది.. 80 ప్లాస్టిక్ బ్యాగులు మింగి..!

ఈ భూమికి మానవుడు ఎంతో ద్రోహం చేస్తున్నాడు. నాగరికత పేరుతో ఇప్పటికే ఎన్ని జీవరాశులు అంతమయ్యేలా చేశాడు. ఇక మనిషి కనిపెట్టిన ప్లాస్టిక్ కారణంగా ఎన్నో జీవులు బ్రతకలేకపోతున్నాయి. ఏదో ఆహార పదార్ధం అనుకుని జంతువులు తినడం.. చచ్చిపోవడం. ఇప్పటిదాకా చిన్న చిన్న జీవులే చనిపోతున్నాయి అని మనం అనుకుంటున్నామా.. కానీ ఏకంగా ఓ తిమింగలమే ఈ ప్లాస్టిక్ దెబ్బకి చనిపోయింది.

బ్యాంకాక్ లో ఓ తిమింగలం కూడా ప్లాస్టిక్ కే బలైంది. ఆ తిమింగలాన్ని బ్రతికించాలని వైద్యులు ఎంతగా అనుకున్నా కూడా సఫలం కాలేకపోయారు. దాని కడుపులో చూడగా ఏకంగా 80 ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నాయట..! థాయ్ లాండ్ లో చాలా ఏళ్ళుగా ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైందట.. చాలా చెత్త సముద్రంలో కూడా కలుస్తూ ఉండడంతో వాటిని సముద్ర జీవులు ఆహారం అనుకుని తింటూ ఉన్నాయి. అలా అనుకొనే పాపం ఈ తిమింగలం ప్లాస్టిక్ బ్యాగులను కడుపు లోకి వేసేసుకుంది. దాని కడుపులో ఉన్న వాటి బరువు 8 కిలోగ్రాముల పైనే ఉందట.. దాదాపు 5 బ్యాగులను వాంతి చేసుకుందట చనిపోయే ముందు ఆ తిమింగలం..! పాపం ఏదీ తినలేక.. కడుపులో ఉన్న వాటిని కక్కేయలేక అవస్థలు పడుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. మనిషి ఈ ప్రకృతికి, జంతువులకు ఎంత ద్రోహం చేస్తున్నాడో ఈ ఒక్క ఘటనే ఉదాహరణ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here