సావిత్రి రేడియో ఇంటర్వ్యూకు దృశ్య రూపం ఇచ్చారుగా..!

‘మహానటి’ సినిమా విడుదలైన తర్వాత సావిత్రి గారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉన్నారు. ఆ సినిమా విడుదలయ్యాక ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆడియో టేప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆమె ‘ఆల్ ఇండియా రేడియో’ బెజవాడ రేడియో స్టేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది.

అయితే ఆ ఇంటర్వ్యూకు దృశ్య రూపం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన యోయో టీవీ యుట్యూబ్ ఛానల్ కు వచ్చింది. అనుకున్నట్లుగానే యాంకర్, హీరోయిన్ అయిన ‘రాధ బంగారు’తో ‘సావిత్రి’ గెటప్ వేయించారు. సావిత్రి నిజంగా ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఎలాంటి హావభావాలను ఇచ్చిందో మనం చూడలేదు కానీ ఆ లోటు మాత్రం రాధ తీర్చారు.. అచ్చం సావిత్రిలా నటిస్తూ రాధ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో ద్వారా..!

ప్రస్తుతం నటి రాధ బంగారు హీరోయిన్ గా నటించడమే కాకుండా.. ఇలా సోషల్ మీడియాలో కూడా అలరిస్తూ ఉంది. రాధ బంగారు నటించిన పలు సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here