శ్రీ‌దేవి హైడ్రాక్సిల్ డ్ర‌గ్స్ తీసుకునే వారా?

ముంబై: అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణానికి గుండెపోటు ఒక్క‌టే కార‌ణం కాదా? సౌంద‌ర్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డానికి ఆమె ప్ర‌మాద‌క‌ర‌మైన హైడ్రాక్సిల్ డ్ర‌గ్స్ తీసుకునే వారా? అంటే అవున‌నే చెబుతోంది సోష‌ల్ మీడియా.

శ్రీ‌దేవి పార్థివ దేహానికి పోస్ట్‌మార్ట‌మ్ పూర్తి చేయ‌డంలో నెల‌కొన్న తీవ్ర జాప్యం ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది. హైడ్రాక్సిల్ డ్ర‌గ్స్‌. ప్ర‌త్యేకించి- బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఉప‌యోగించే ఔష‌ధం ఇది. ఆక‌లిని చంపేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

శ‌రీరంలో ఉండే మెట‌బాలిక్ రేట్‌ను పెంచ‌డంతో పాటు గుండె స్పంద‌న‌ను వేగవంతం చేస్తుంది ఈ హైడ్రాక్సిల్ డ్ర‌గ్స్‌. ఇది గుండె స్పంద‌న క్ర‌మంగా, ద‌శ‌ల‌వారీగా వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శ్రీ‌దేవి విష‌యంలో ద‌శ‌ల‌వారీగా కాకుండా ఒక్క‌సారిగా హార్ట్ బీట్ పెర‌గ‌డానికి కార‌ణ‌మై ఉంటుంద‌నే అనుమానాలు ఉన్నాయి. శ్రీ‌దేవి బాగా బ‌క్క‌చిక్కిన‌ప్ప‌టికీ.. ఆమె సౌంద‌ర్యంలో మాత్రం ఎలాంటి తేడా రాలేదు.

వ‌య‌స్సు మీద ప‌డ‌టం వ‌ల్ల సాధార‌ణంగా వ‌చ్చే ముడుత‌లు ఎక్క‌డే గానీ లేవు. ముఖం మీదే కాదు.. శ‌రీరంపై ఎక్క‌డా ముడుత‌లు లేవు. దీనికి కార‌ణం..హైడ్రాక్సిల్ డ్ర‌గ్స్‌తో పాటు సౌంద‌ర్య ప‌రిర‌క్ష‌ణ కోసం ఆమె తీసుకుంటున్న ప్ర‌త్యేక వైద్య‌మే కార‌ణ‌మ‌నే వాద‌న ఉంది.

ఆమె ఇటీవ‌లి కాలంలో న‌టించిన ఇంగ్లిష్‌-వింగ్లిష్, మామ్ సినిమాల్లో ఆమెను అసాంతం ప‌రిశీలిస్తే.. శ‌రీరంలో వ‌చ్చిన తేడాలు, మార్పులు తెలుస్తాయ‌ని అంటున్నారు.

ఈ అనుమానాల‌కు తావిచ్చేలా దుబాయ్‌లో ఆమె పార్థివ దేహానికి పోస్ట్‌మార్ట‌మ్ చేయ‌డంలో నెల‌కొన్న జాప్యం కూడా కార‌ణ‌మౌతోంద‌ని చెబుతున్నారు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక ఏమి చెబుతుంద‌నే విష‌యం మీద ఆస‌క్తి నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here