విరాట్ తన సెంచరీల రికార్డును అధిగమిస్తే సచిన్ ఏమి చేయనున్నాడంటే..!

సచిన్ టెండూల్కర్.. తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతోనూ.. ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లతోనూ గడిపిన సచిన్ సాయంత్రం వాంఖడే స్టేడియంలో కేక్ కూడా కోశాడు. ఇక ఇంటర్వ్యూల సమయంలో ప్రస్తుత క్రికెటర్లలో టాప్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ గురించి కూడా సచిన్ ప్రస్తావించాడు. సచిన్ కొట్టిన రికార్డుల్లో ఒకటైన 49 సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ తో షాంపేన్ పంచుకుంటానని చెప్పాడు.

కోహ్లికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రామిస్ చేశాడు. కోహ్లి ఇప్పటికే వన్డేల్లో 35 సెంచరీలు పూర్తి చేశాడు. కోహ్లి ఇదే దూకుడు కనబరిస్తే.. సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. చర్చంతా అతడు ఎంత కాలంలోగా ఈ రికార్డ్‌ను అధిగమిస్తాడనే. కోహ్లి గనుక తన 49 సెంచరీల రికార్డ్‌ను బ్రేక్ చేస్తే అతడితో కలిసి షాంపేన్ పంచుకుంటానని సచిన్ చెప్పాడు. విరాట్ నా రికార్డ్‌ను అధిగమిస్తే.. తనకు షాంపెన్ బాటిళ్లు పంపడం కాదు.. నేనే తన దగ్గరకెళ్లి షాంపెన్ బాటిల్ పంచుకుంటానని మాస్టర్ బ్లాస్టర్ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here