మీ దగ్గర ఉన్న కొత్త నోట్లు చిరిగిపోయాయో..!

పాత నోట్లు చిరిగిపోతూ ఉంటే.. వాటికి ప్లాస్టర్ వేసి ఎలాగోలా మార్చేయాలని చూస్తూ ఉంటాం. మరి కొత్తగా వచ్చిన నోట్ల పరిస్థితి ఏమిటంటే.. ఆ దేవుడికే తెలియాలి అని అంటున్నారు బ్యాంకు సిబ్బంది కూడానూ..! ఏకంగా ఆర్బీఐ కూడా ఇప్పటిదాకా దీని మీద ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదంటే జనాల్లో ఎంత కన్ఫ్యూజన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కేంద్రం విడుదల చేసిన రూ.2000.. రూ.500.. రూ.200.. రూ.50.. రూ.10తో సహా కొత్తనోట్లు చిరిగితే తీసుకునేందుకు ఇప్పటిదాకా ప్రభుత్వం మార్గదర్శకాల్ని సిద్ధం చేయలేదు. గతంలో మాదిరి చినిగిన నోట్లను వెనక్కి తీసుకునే విధానంపై ఆర్బీఐ నుంచి ఎలాంటి సూచనలు బ్యాంకులకు రాలేదట. చిరిగిన కొత్త నోట్లను తీసుకొని బ్యాంకులకు వెళితే వెనక్కు ఇచ్చేస్తున్నారు. సర్లే అని.. హైదరాబాద్ లోని రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లినా వారు వెనక్కి తీసుకోవటానికి ఒప్పుకోకపోవటం లేదు. ఆర్ బీఐ నుంచి తమకు మార్గదర్శకాలు రాలేదని.. అవి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెబుతున్నారు. మన దగ్గర చిరిగిపోయినప్పుడు సరే అదే ఏటీఎం లలో నుండి చిరిగిపోయిన నోట్లు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here