వాట్సప్ లో సరికొత్త ఫీచర్లు.. మరింత కిక్ ఇవ్వనున్నాయి..!

వాట్సప్ యాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. దీని ద్వారా వాట్సప్ మరింత ఆకర్షణీయంగా తయారుకానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సప్ గ్రూప్ చాట్ లో కొన్ని మార్పులు రానున్నాయి. వాట్సప్ గ్రూపులో ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్‌లుగా ఉండే సౌకర్యం ఉంది. అయితే కొన్నిసార్లు గ్రూపులో అడ్మిన్‌గా ఉన్న వ్యక్తిని అడ్మిన్ బాధత్యల నుంచి తొలగించే క్రమంలో సదరు వ్యక్తిని పూర్తిగా గ్రూపు నుంచి తొలగించాల్సి వస్తోంది. మళ్లీ ఆ వ్యక్తిని గ్రూపులోకి కొత్తగా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా కేవలం గ్రూప్ అడ్మిన్‌గా మాత్రమే గ్రూపు నుంచి తొలగించే సౌకర్యంతో కొత్త ఫీచర్ బటన్ ‘డిస్మిస్’ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లో‌ ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పటికే గూగుల్ ప్లే బీటా ఆండ్రాయిడ్ 2.18.12 వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ఈ క్రమంలో గ్రూప్‌ అడ్మిన్‌గా ఉండే వ్యక్తులకు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై కూడా ప్రస్తుతం వాట్సాప్‌ పనిచేస్తోంది. గ్రూప్‌లోని సభ్యులెవరైనా చేసే టెక్ట్స్‌, ఫొటో, వీడియో, జిఫ్‌, డాక్యుమెంట్‌, వాయిస్‌ మెసేజ్‌లు వంటివి ఏవైనా నియంత్రించే అధికారం అడ్మిన్‌లకు ఇవ్వనుంది.

వాట్సాప్ మరో కొత్త ‘క్విక్ స్విచ్’ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ నుంచి వీడియో కాల్స్‌కు మార్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here