విరాట్ కోహ్లీకి రక్తంతో రాసిన లవ్ లెటర్ వచ్చింది.. అప్పుడేమి చేశాడంటే..!

విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో ఉన్న క్రికెటర్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నవాడు. అలాగే ఎంతో మంది ఫేవరేట్ కూడా..! ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారా దాన్ని మనం కొలవలేము. కొన్ని మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం కూడా స్టార్లకు ఎంతో ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది.

అలాంటి ఘటననే విరాట్ కోహ్లీ ఇటీవల బయటపెట్టాడు. తాను ఒకసారి ఢిల్లీలో కారులో వెళుతున్నానని.. ఇంతలో కొందరు తనను గుర్తుపట్టి కొన్ని లెటర్లు ఇచ్చారని చెప్పాడు. ఎవరు ఇచ్చింది కూడా తాను చూడలేదన్నాడు. అయితే అందులో ఓ లేఖ మాత్రం చాలా భయపెట్టిందని అన్నాడు. అదేమిటంటే రక్తంతో రాసి ఉన్న లేఖ. దానిని పూర్తిగా కూడా చూడలేదు. దానిపై రాసిన వ్యక్తి పేరు ఉంది. వెంటనే దానిని సెక్యూరిటీకి ఇచ్చేశాను. దానిని స్వీకరించలేకపోయాను. ఎంతో భయం వేసింది అని విరాట్ తనను భయపెట్టిన ఫ్యాన్ గురించి చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here