శంకరా.. శివరాత్రి రేపా.. ఎల్లుండా..?

ఎప్పుడూ లేనిది ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడూ అన్న విషయంలో చాలా మంది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. శివరాత్రి 13వ తేదీనా.. లేక 14వ తేదీనా అన్న డైలమాలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఇప్పటికీ పండితులు ఓ అభిప్రాయానికి రాకపోవడంతో ఉపవాస దీక్ష ఎప్పుడు చేపట్టాలన్న విషయమై చాలా మంది భక్తుల్లో అయోమయం నెలకొంది. పంచాంగకర్తల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.

మహాదేవుడు లింగావతారంగా అవతరించిన రోజే మహా శివరాత్రి పర్వదినం అన్నది అందరికీ తెలిసిందే. చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ చతుర్దశి ఈ నెల 13వ తేదీన ఉందని అంటున్నారు. మరికొందరు చతుర్దశి 14న అధిక సమయం తిథి ఉందని చెబుతూ ఆ రోజునే పండగ అంటున్నారు. లింగోద్భవ పూజలు రాత్రిపూట జరుగుతాయని, రాత్రిపూట చతుర్థశి మంగళవారమే ఉంది కాబట్టి శివరాత్రి మంగళవారమేనని అత్యధికులు చెబుతున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కోటప్పకొండ, సత్రశాల, గొట్టిపాళ్ల, అమరావతి తదితర ప్రాంతాల్లో రేపు శివరాత్రిని జరుపుకోనున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ఉన్న పంచారామ శైవక్షేత్రాల్లో భాగమైన ద్రాక్షారామం, సోమారామాల్లో ఎల్లుండి పర్వదినం జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here