పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు అన్న బాలయ్య.. ఎందుకంటే..!

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ గురించి తెలియంది ఎవరికి చెప్పండి. ఓ వైపు రాజకీయ నాయకుడిగా.. మరో వైపు నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం తనకు పవన్ ఎవరో తెలీదని అన్నారు. అదేంటి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పవన్ ప్రచారం చేశాడుగా ఎలా బాలయ్య మరచిపోతాడు అని అనుకోకండి. కావాలనే ఆయన ఓ ప్రశ్నను దాటవేయడానికి అలా చెప్పారు. ఇంతకూ ఏమి జరిగిందంటే..

జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారని.. మీ స్పందన ఏంటి అని ఓ విలేకరి బాలకృష్ణను ప్రశ్నించారు. దానికి సమాధానంగా “పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అంటూ కారును ఎక్కి వెళ్లిపోయాడు. గత ఎన్నికల్లో టీడీపీకే మద్దతును ఇచ్చి ప్రచారం చేసిన వ్యక్తిని బాలకృష్ణ తెలీదని చెప్పడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మరీ ఇలా అనాలా అని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నందుకు స్వాగతం అని ఓ మాట అనేసుంటే బాగుణ్ణు కదా బాలయ్యా అని అభిమానులు అంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here