డ్రగ్స్ మింగిన వ్యక్తి పోలీసుల అదుపులో.. మూడు వారాలుగా ఎప్పుడు బాత్ రూమ్ పోతాడా ఎదురుచూస్తున్నారు..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వారాలుగా ఆ వ్యక్తి టాయ్ లెట్ కు ఎప్పుడు వెళతాడా అని ఎదురుచూస్తున్నారు పోలీసులు. ఎందుకంటే అతడి కడుపులో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి..! కడుపులో డ్రగ్స్ దాచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద అతన్ని దోషిగా నిరోపించడానికి సాక్ష్యాలు ఏవీ లేవు.. ఉన్నది ఒకే ఒక్క సాక్ష్యం.. అది అతడి కడుపులోని డ్రగ్స్ మాత్రమే.. అది బయటకు వస్తే పోలీసులు తనను జీవితాంతం జైలులోనే మగ్గేలా చేస్తారని భావించిన ఆ వ్యక్తి అసలు బాత్ రూమ్ కి వెళ్ళడమే మానేశాడు. అది కూడా మూడు వారాలుగా..!

ఈ ఘటన యునైటెడ్ కింగ్డమ్ లోని ఎసెక్స్ లో చోటుచేసుకుంది. జనవరి 17న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హార్లో లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పటి నుండి అతడు టాయ్ లెట్ కు ఎప్పుడు పోతాడా అని పోలీసులు ఎదురుచూస్తున్నారు. అతడు తన లెట్రీన్ స్ట్రైక్ ను ఎప్పుడు ఎత్తేస్తాడా అని ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రతిరోజూ అతడి కోసం వైద్యులు వస్తున్నా కూడా.. అతడు తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నాడట..! ఈ గురువారానికి ఆ వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉండి 22 రోజులు అయిందట. జనవరి 17న అతడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పసిగట్టిన పోలీసులు అతన్ని ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అయితే వారు అతన్ని అదుపులోకి తీసుకునే కొన్ని నిమిషాల ముందు అతడు ఆ డ్రగ్స్ ను మింగేశాడు. దీంతో అప్పటి నుండి పోలీసులు అతడు ఎప్పుడు టాయ్ లెట్ కు వెళతాడా అని ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here