భార్య, పిల్ల‌ల్ని చూడ్డానికి 20 రోజుల కింద‌టే దుబాయ్ నుంచి ఇంటికొచ్చాడు..భార్య చేతిలో!

జీవనోపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడో వ్య‌క్తి. స్వ‌స్థ‌లంలో నివాసం ఉంటోన్న భార్య‌, ఇద్ద‌రు కుమార్తెల‌ను చూడ్డానికి స‌రిగ్గా 20 రోజుల కింద‌టే ఇంటికొచ్చాడు.

ఇంటికొచ్చిన కొద్దిరోజుల్లోనే భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం త‌ల్లెత్తింద‌త‌నికి. అయిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. భార్య గుడికి వెళ్దామంటే ఆనందంగా ఆమె వెంట బ‌య‌లుదేరి వెళ్లాడు.

పిల్ల‌లు కూడా వ‌స్తానంటే.. వ‌ద్ద‌ని చెప్పింద‌త‌ని భార్య‌. ఇద్ద‌ర‌మే వెళ్లివ‌స్తామ‌ని చెప్పింది. అంతే! త‌మ తండ్రిని చూడ‌టం అదే చివ‌రిసారి అవుతుంద‌ని ఊహించ‌లేదా కుమార్తెలు.

గుడి ఆవ‌ర‌ణ‌లోనే అతి దారుణంగా త‌న భ‌ర్త పీక కోసి హ‌త‌మార్చిందామె. దీనికి కార‌ణం.. వివాహేత‌ర సంబంధం. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌యం ఆవ‌ర‌ణ‌లో చోటు చేసుకుంది.

హ‌తుడి పేరు బాల‌య్య‌. నంగునూరు మండలం ఘణపూర్ గ్రామ నివాసి. ప‌దేళ్ల కింద‌ట అత‌నికి న‌ర్స‌వ్వతో వివాహ‌మైంది. ఇద్ద‌రు కుమార్తెలు జ‌న్మించారు.

 

జీవ‌నోపాధి కోసం ఆరేళ్ల కింద‌ట బాల‌య్య దుబాయ్‌కు వల‌స వెళ్లాడు. న‌ర్స‌వ్వ‌కు స్థానికంగా ఓ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది.

త‌ర‌చూ ఆ యువ‌కుడితో ఏకాంతంగా గ‌డిపేది. ఈ విష‌యం బాల‌య్య‌కు తెలియ‌దు. 20 రోజుల కింద‌ట బాల‌య్య ఘ‌ణ‌పూర్‌కు వెళ్లాడు. ఒక‌రిద్ద‌రు స్నేహితులు ఈ విష‌యాన్ని త‌న దృష్టికి తీసుకొచ్చిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఆదివారం నర్సవ్వతో కలిసి వేములవాడకు వెళ్లాడు. రాజ‌న్న ఆల‌యంలో గ‌దులు దొర‌క్క‌పోవ‌డంతో.. ఇద్ద‌రూ ఆల‌య ప్రాంగ‌ణంలో ఆరుబ‌య‌టే ప‌డుకున్నారు.

ఈ స‌మ‌యంలో వివాహేత‌ర సంబంధం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ చోటు చేసుకుంది. ముందే ప్లాన్ వేసుకుందో, ఏమో గానీ న‌ర్స‌వ్వ త‌న వెంట క‌త్తిని కూడా తెచ్చుకుంది.

ఆ క‌త్తితో బాల‌య్య గొంతు కోసి ప‌రారైంది. తెల్ల‌వారు జామున ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న బాల‌య్య మృత‌దేహాన్ని చూసిన భ‌క్తులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఘ‌ణ‌పూర్ గ్రామానికే చెందిన వెంక‌ట్‌రెడ్డితో ఆమె వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తోంద‌ని, భ‌ర్త అడ్డు తొల‌గించుకోవ‌డానికి అత‌ణ్ణి హ‌త‌మార్చింద‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here