భ‌ర్త వివాహేత‌ర సంబంధం: అత‌ని మ‌ర్మాంగాన్ని కోసి..టాయ్‌లెట్ ప‌డేసిన భార్య‌!

జ‌లంధ‌ర్‌: భ‌ర్త వివాహేత‌ర సంబంధంతో విసిగిపోయిందో భార్య‌. ఎన్నిసార్లు చెప్పిన‌ప్ప‌టికీ వినిపించుకోలేదు. పైగా- త‌న క‌ళ్ల‌ముందే ప‌రాయి స్త్రీలతో చ‌నువుగా ఉండ‌టాన్ని భ‌రించ‌లేక‌పోయింది. అత‌నికి దారుణ శిక్ష విధించింది.

భ‌ర్త అంగాన్ని కోసేసింది. దాన్ని తీసుకెళ్లి టాయ్‌లెట్ బేసిన్‌లో ప‌డేసి ఫ్ల‌ష్ చేసింది. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌లో చోటు చేసుకుంది. జ‌లంధ‌ర్‌లోని జోగీందర్‌ నగర్‌లో నివసించే ఆజాద్‌ సింగ్‌కు ఎనిమిదేళ్ల కింద‌ట సుఖ్‌వంత్ కౌర్‌తో వివాహ‌మైంది.

వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఆజాద్ సింగ్ వ్యాపారి. అత‌నికి వేరే మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఏడాదికాలంగా ఆజాద్ సింగ్ ఆ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు.

ఈ విష‌యం సుఖ్‌వంత్ కౌర్‌కు తెలిసింది. ఆమె ప‌లుమార్లు భ‌ర్త‌ను హెచ్చ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. అత‌నిలో మార్పు రాక‌పోవ‌డంతో గుణ‌పాఠం చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో ఇనుప రాడ్‌తో తలపై కొట్టింది.

దీనితో అత‌ను స్పృహ కోల్పోయాడు. అప్ప‌టికీ క‌సి తీర‌క కూర‌గాయ‌లు త‌రిగే కత్తితో అతని మ‌ర్మాంగాన్ని కోసింది. దాన్ని తీసుకెళ్లి టాయిలెట్‌ బేసిన్‌లో ప‌డేసి, ఫ్ల‌ష్ చేసింది. కొద్దిసేప‌టి త‌రువాత అత‌నికి మెల‌కువ వ‌చ్చింది.

వెంట‌నే త‌న తండ్రికి ఫోన్ చేశాడు. ఆజాద్‌ తండ్రి.. హుటాహుటిన ఆజాద్‌సింగ్‌ను ఆసుప‌త్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుఖ్‌వంత్‌ కౌర్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here