న‌డిరోడ్డు మీద ప‌రుగెత్తిస్తూ చెప్పుతో కొడుతున్న ఆమె.. 

భార్య జీవించి ఉండ‌గానే ఇంకో పెళ్లి చేసుకున్నాడో ప్ర‌బుద్ధుడు. ఆమెకు తెలియ‌కుండా కాపురం పెట్టాడు. ఇది తెలిసిన అత‌ని భార్య అప‌ర కాళిక‌లా మారింది. న‌డిరోడ్డు మీదే భ‌ర్త‌కు బ‌డితె పూజ చేసింది. చెప్పుతో కొట్టింది. ఉతికి ఆరేసింది. తెలంగాణ‌లోని మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌ని ఇది.

జిల్లాలోని కేసముద్రం మండలం మహబూబ్‌పట్నంకు చెందిన షాలిని అనే మహిళకు అదే తండాకు చెందిన వీరన్నతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహమైన ఆరు సంవత్సరాల వరకు వీరి కాపురం సజావుగానే గడిచింది. అనంతరం వీరన్న మరో పెళ్లి చేసుకుని షాలినికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తోంది.

విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లిచేసుకుందే కాక, తనపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలంటూ వీరన్న బెదిరించసాగాడు. దీంతో విసుగెత్తిన ఆమె స్థానికుల సాయంతో భర్తకు దేహశుద్ధి చేసింది. అందరూ చూస్తుండగా అతడిని వెంబడించి మరీ చెప్పుతో కొట్టింది. బట్టలు చించేసి చితక్కొట్టింది. అత‌నిపై కేస‌ముద్రం పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here