ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌డ‌క సీన్లు! మ‌హిళా ఉద్యోగితో..!

ఉడుపి: ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనే దుకాణం పెట్టేశాడో ఉద్యోగి. త‌న వ‌ద్ద ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగితో కార్యాల‌యంలోనే ప‌డ‌క సీన్ల‌ను పండించాడు. లైంగిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డాడు. క‌ర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ ఉద్యోగి పేరు అనంత ప‌ద్మ‌నాభ నాయ‌క్‌. పంచాయ‌తీ అభివృద్ధి అధికారి.

జిల్లాలోని కుందాపుర తాలూకా ప‌రిధిలో ఉన్న నాల్కూరు గ్రామ పీడీఓ. నాల్కూరు గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యంలో మ‌హిళా ఉద్యోగితో రాస‌లీల‌లు సాగిస్తూ, సీసీ కెమెరాల కంటికి చిక్కాడు. అనంత ప‌ద్మ‌నాభ నాయ‌క్ మాజీ సైనిక ఉద్యోగి.

సైన్యంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత మాజీ సైనికుల కోటాలో ఈ ఉద్యోగాన్ని సంపాదించాడు. నాల్కూరు గ్రామ పంచాయ‌తీ అభివృద్ధి అధికారిగా ఏడాదికాలంగా ప‌ని చేస్తున్నాడు. అదే కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ యువ‌తితో వివాహేత‌ర సంబంధాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు. కార్యాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లోనే ఆ యువతితో లైంగిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డాడు.

ఆయా దృశ్యాల‌న్నీ సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఈ వీడియో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే పంచాయ‌తీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి అత‌నిపై కుందాపుర పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. యువ‌తిపై అత్యాచారం చేశాడ‌నే కేసు కింద కుందాపుర పోలీసులు అనంత ప‌ద్మ‌నాభ నాయ‌క్‌పై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here