ఎదురింటి ఒంటరి ఆంటీ.. ప‌దో త‌ర‌గ‌తి బాలుడిపై క‌న్నేసింది!

ఒంట‌రిగా నివ‌సిస్తోన్న మ‌హిళ ఒక‌రు 14 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఉదంతం ఇది. కృష్ణా జిల్లా నున్న పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని పాయ‌కాపురంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధిత బాలుడు, అత‌ని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆ మ‌హిళ‌పై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

ఆ మ‌హిళ‌కు భ‌ర్త లేడు. ప‌దేళ్ల కిందట ఆయ‌న మ‌ర‌ణించారు. త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి పాయ‌కాపురం వాంబే కాల‌నీలో నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రు కుమార్తెల‌కు కూడా పెళ్లిళ్లు చేసింది. అత్తారింటికి పంపించింది. దీనితో ఆమె ఒంట‌రిగా వాంబే కాల‌నీలోనే నివ‌సించ‌సాగింది. ఈ క్ర‌మంలో- ఆమె త‌న ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడిపై క‌న్నేసింది. ఎదురెదురు నివాసాలే కావ‌డంతో రెండు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు ఉండేవి.

కొద్దిరోజుల కింద‌ట త‌న ఇంటికి వ‌చ్చిన బాలుడిని ఆమె లోబ‌రచుకుంది. లైంగిక వేధింపుల‌కు గురి చేసింది. ఆ దృశ్యాల‌ను వీడియో తీసింది. త‌ర‌చూ వాటిని చూపించి బాలుడిపై లైంగిక దాడికి దిగుతుండేది. తాను పిలిచినప్పుడల్లా ఇంటికి రావాలని బెదిరిస్తుండేది. దీనికి భ‌య‌ప‌డిన ఆ బాలుడు ద‌గ్గ‌రి బంధువు ఇంట్లో ఎక్కువ‌గా గ‌డ‌ప‌సాగాడు.

అప్పటి నుంచి అక్కడ ఉండడం మానేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి రావకపోవడానికి కారణమేమిటని తల్లిదండ్రులు నిల‌దీయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వెంట‌నే వారు నున్న పోలీస్‌స్టేష‌న్‌లో ఆ మ‌హిళ‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here