చనిపోయిందని చెప్పారు.. పూడ్చేశారు.. కానీ 11 రోజుల పాటూ సమాధిలోనే అరుస్తూ ఉంది..!

వైద్యులు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళను సమాధిలో పూడ్చేశారు. అయితే ఆమె దాదాపు 11 రోజుల పాటూ ఆ సమాధి నుండి బయటకు రావడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. చివరి దాకా తనను బయటకు తీస్తారని భావించిన ఆమె ఆశలు ఆ సమాధిలో అంతం అయిపోయాయి.

బ్రెజిల్ కు చెందిన 37 ఏళ్ల శాంటోస్ అనే మహిళను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా ఆమె హార్ట్ అటాక్ తో చనిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆమెను ఆమె కుటుంబం సెన్హోరా శాంటానా స్మశానవాటికలో సమాధి చేశారు. ఆమెను ఓ శవపేటికలో ఆమెను ఉంచి సమాధి చేసి.. దాని మీద సిమెంట్ తో సమాధి కట్టారు. అయితే ఆమె దాదాపు 11 రోజులు సమాధిలోనే ఉండిపోయింది. జనవరి 28న చనిపోయిందని వైద్యులు తెలపగా ఆ తర్వాతి రోజునే ఆమెను సమాధి చేశారు.

తర్వాత అక్కడ ఆడుకుంటున్న పిల్లలు సమాధిలో నుండి శబ్దాలు రావడం గమనించారు. అయితే వీటిని ఎవరూ నమ్మలేదు. కానీ ఓ మహిళ ఫిబ్రవరి 9వ తేదీన శబ్దాలు విని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన బంధువులు సమాధిని పగులగొట్టి బయటకు తీశారు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. పాపం ఆమె తన శవపేటికను తెరవాలని తెగ ప్రయత్నించింది. ఆమె చేతి మీద.. నుదురు మీద పలు గాయాలు ఉన్నాయి. బయటకు రావాలని ఆమె చాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే శవ పేటిక మీద కొట్టిన మేకులు కూడా కొన్ని బయటకు వచ్చాయి కానీ ఆమె పూర్తిగా బయటకు రాలేకపోయింది. ఆమెను బయటకు తీసే సమయానికి చనిపోయింది. కానీ ఆమె శరీరం మాత్రం వేడిగానే ఉంది. తిరిగి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళగా చనిపోయిందని స్పష్టం చేశారు వైద్యులు. కొన్ని గంటల ముందు కానీ ఆ సమాధిని త్రవ్వింటే ఆమె బ్రతికి ఉండే అవకాశం ఉండేదట. శాంటోస్ ఆయాసం కారణంగా కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. ఆమె స్పృహ తప్పి పడిపోయింటే హార్ట్ అటాక్ తో మరణించిందని వైద్యులు తెలపడంతోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు వైద్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here