మొక్క‌లు నాట‌డానికి పెర‌ట్లో గుంత త‌వ్వాడు..పుర్రె! నా మొద‌టి భ‌ర్తదేనంటోన్న రైతు భార్య‌!

రష్యాలోని లుజీనో గ్రామంలో ఊరి చివరన ఓ ముసలి జంట నివాసం ఉంటోంది. మహిళ మొదటి భర్త చనిపోయిన తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. వారిది రైతు కుటుంబం. పొలంలో ఆలుగ‌డ్డ‌ల మొక్క‌ల‌ను నాటడానికి బంగాళదుంప మొక్కలు నాటుదామని భావిస్తున్న ఆమె రెండో భర్త ఇంటి పెరట్లో తవ్వడంతో పుర్రె బయటపడింది.

మ‌రింత‌ లోతు తవ్వడంతో ఎముకలు కూడా బయటపడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే అతను భార్యకు తెలిపాడు. ఆమె కంగారు పడొద్దని చెబుతూ ఆ అస్థికలు తన తొలి భర్తవని వెల్లడించింది. తరచూ అతను హింసిస్తుండటంతో 20 ఏళ్ల క్రితం గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపింది.

పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని, అస్థికలను తిరిగి భూమిలో కప్పెట్టేయాలని ఆమె త‌న రెండో భ‌ర్త‌ను సూచించింది. దీనితో అత‌ను ఒక్కసారిగా అతను హడలిపోయాడు. హుటాహుటిన పోలీసులను ఆశ్రయించాడు. మహిళను అరెస్టు చేయగా ఆమె నిజాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here