న‌చ్చిన వాడిని మ‌నువాడిన‌ప్ప‌టికీ..!

అత్తింటి ఆరాళ్ల‌కు మ‌రో మ‌హిళ బ‌లి అయ్యారు. నిఖా చేసుకుని మూడేళ్లు కూడా నిండ‌లేదు. అప్పుడే ఆమెకు నూరేళ్లు నిండాయి. అద‌న‌పు క‌ట్నం కోసం భ‌ర్త‌, అత్తింటి వారు పెడుతోన్న వేధింపుల‌ను భ‌రించ‌లేక‌.. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఉరి వేసుకున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని దావ‌ణగెరెలో చోటు చేసుకుంది.

మృతురాలి పేరు ఆఫ్రిన్ బాను. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. మూడేళ్ల కింద‌ట ఇద్రిస్ అనే యువ‌కుడితో ఆమెకు వివాహ‌మైది. పెళ్ల‌యిన‌ప్ప‌టి నుంచీ ఆమె అత్తింటి ఆరాళ్ల‌ను ఎదుర్కొన్నారు. న‌చ్చిన వాడిని మ‌నువాడిన‌ప్ప‌టికీ..ఆమెకు మాత్రం అద‌న‌పు క‌ట్నం వేధింపులు త‌ప్ప‌లేదు.

భ‌ర్త కూడా త‌ల్లి, ఇత‌ర కుటుంబీకుల‌కు వంత పాడుతుండ‌టాన్ని ఆమె స‌హించ‌లేక‌పోయారు. వేధింపుల‌ను భ‌రించ‌లేక‌పోయారు. దీనితో ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై దావ‌ణగెరె మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here