టిప్పు డ్రాప్ పాయింట్ నుంచి దూకేసింది..

బెంగ‌ళూరు: `టిప్పు డ్రాప్ పాయింట్‌..` తాను విశ్రాంతి తీసుకుంటున్న నంది దుర్గాన్ని న‌లువైపుల నుంచీ బ్రిటీష్ సైనికులు చుట్టుముట్టిన‌ప్పుడు త‌న గుర్రంతో స‌హా 50 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతాడు టిప్పు సుల్తాన్‌. అక్క‌డి నుంచి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటాడు. అందుకే దానికి టిప్పు డ్రాప్ పాయింట్ అనే పేరొచ్చింది.

అదే డ్రాప్ పాయింట్ నుంచి కిందికి దూకి, ఆత్మ‌హ‌త్య చేసుకుందో మ‌హిళ‌. క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క కేంద్రం నంది హిల్స్‌పై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు శ్వేత‌. బెంగ‌ళూరుకు 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుందీ నంది హిల్స్‌.

మాలూరు ప‌ట్ట‌ణానికి చెందిన శ్వేత‌.. ఆటోలో నందిహిల్స్‌కు చేరుకుని, టిప్పు డ్రాప్ పాయింట్ నుంచి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. అంత ఎత్తు నుంచి దూక‌డంతో కొండ‌గుట్ట‌ల‌పై ప‌డిన ఆమె శ‌రీరం ఛిద్ర‌మైంది.

ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే నందిహిల్స్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఆటో డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here