రాత్రి ఇంట్లో నిద్ర‌పోయిన మ‌హిళ‌: తెల్లారే స‌రికి ఆమె, ఆమె పిల్ల‌లు రైలు ప‌ట్టాల‌పై!

విజ‌య‌పుర‌: కుటుంబ క‌ల‌హాల‌తో ఓ మ‌హిళ త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని విజ‌యపుర జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆ మ‌హిళ‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు మ‌ర‌ణించ‌గా.. మ‌రొక‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

 

జిల్లాలోని ఇండి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. మృతుల‌ను ఇండి తాలూకాలోని శాత‌పుర గ్రామానికి చెందిన ల‌క్ష్మీ ప్ర‌కాశ్ బుదిహాళ్, ఆమె కుమారుడు మూడేళ్ల బీర‌ప్ప‌, ఏడాది కుమార్తె అంకుశగా గుర్తించారు.

మ‌రొక‌రు గాయాల‌పాల‌య్యారు. సోమ‌వారం రాత్రి వారు ఇండి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో రైలు కింద ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్టు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే ల‌క్ష్మీ ప్ర‌కాశ్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై ఇండి రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

మృతురాలి భ‌ర్త‌, అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాత్రి త‌న భార్యా, పిల్ల‌లు భోజ‌నం చేసి, ప‌డుకున్నార‌ని, త‌మ మ‌ధ్య ఎలాంటి గొడ‌వా జ‌ర‌గ‌లేద‌ని అత‌ను చెబుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here