త‌ల‌పై చిన్న‌పిల్ల‌లో టోపీ, చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయ‌ర్‌ఫోన్‌..బీభ‌త్సం:

ధార‌వాడ‌: త‌ల‌పై చిన్న‌పిల్ల‌ల టోపీ, చేతిలో సెల్ ఫోన్‌, చెవిలో ఇయ‌ర్ ఫోన్‌. ఇంత‌కంటే ఇంకేం కావాల‌నుకున్న‌ట్టుందా మ‌హిళ‌. పాట‌లు వింటూ రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో న‌డిరోడ్డుపై డాన్స్ చేసింది. కుప్పి గంతులు వేసింది. ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించింది.

బైకు, బ‌స్సు, ఆటో..ఏదొచ్చినా అద‌ర‌కా..బెద‌ర‌కా అడ్డుగా నిల్చుంది. త‌న‌తో పాటు డాన్స్ చేయాలంటూ బ‌ల‌వంత పెట్టింది. ఇదంతా మ‌ద్యం మ‌త్తులో చేసింద‌ట‌. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార‌వాడ జిల్లా కేంద్రం న‌డిబొడ్డున ఉన్న జుబిలీ స‌ర్కిల్‌లో చోటు చేసుకుంది. ఈ జుబిలీ స‌ర్కిల్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.

స‌మీపంలోనే బ‌స్‌స్టాండ్ ఉండ‌టంతో 24 గంట‌ల పాటూ బ‌స్సుల రాక‌పోక‌లు కొన‌సాగుతుంటాయి. అలాంటి చోట ఈ మ‌హిళ మద్యం మ‌త్తులో వీరంగం సృష్టించింది. చూసేవారికి వినోదాన్ని పంచిన‌ట్ట‌యింది.

చివ‌రికి పోలీసులు కూడా కొద్దిసేను ఆమె త‌మాషాను చూశారు. మ‌ద్యం మ‌త్తులో ఉండ‌టంతో ద‌గ్గ‌రికి వెళ్ల‌డానిక్కూడా భ‌య‌ప‌డ్డారు. అలా డాన్స్ చేసుకుంటూ ఆమె అక్క‌డి నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here