టేప్‌తో చుట్టి భ‌ద్రంగా ప్యాక్ చేసిన యూరియా సంచిలో..!

టేప్‌తో చుట్టి, భ‌ద్రంగా ప్యాక్ చేసిన యూరియా సంచి ఒక‌టి.. రైల్వేస్టేష‌న్ ఎదురుగా ఉన్న మున్సిపల్ చెత్త తొట్టిలో క‌నిపించింది. కంటికి కాస్త భారీగా క‌నిపించ‌డంతో చెత్త ఏరుకునే వారు దానిపై ప‌డ్డారు. మొద‌ట దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో చెత్త‌కుప్ప నుంచి వ‌స్తోంద‌ని భావించారు. సంచిని త‌డిమి చూడ‌గా, చేతికి మెత్త‌గా త‌గిలింది. దీనితో ఉలిక్కిప‌డ్డారు.

ఎందుకైనా మంచిద‌నే అనుమానంతో స్థానికుల‌కు తెలియ‌జేశారు. వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంటనే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ యూరియా సంచిని తెరిచి చూసి షాక్‌కు గుర‌య్యారు. అందులో ఉన్న‌ది ఓ మ‌హిళ మృత‌దేహం.

సుమారు 30 సంవ‌త్స‌రాలు ఉంటాయి. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని డ‌బీర్‌పురా రైల్వేస్టేష‌న్ వ‌ద్ద చోటు చేసుకుంది. మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కొన్ని గంట‌ల వ్య‌వధిలోనే దీన్ని ఛేదించారు. భ‌ర్తే హంత‌కుడిగా తేల్చారు. అత‌ణ్ని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here