పూజా సామాగ్రిని విక్ర‌యించే షాప్‌లో మ‌హిళ మృత‌దేహం..న‌గ్నంగా!

ఒడిశాలోని ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం కోణార్క్ సూర్య నారాయ‌ణుడి ఆల‌యం. ఈ ఆల‌యానికి కూత‌వేటు దూరంలో, పూజా సామాగ్రిని విక్ర‌యించే ఓ దుకాణంలో మ‌హిళ మృత‌దేహం న‌గ్నంగా ల‌భించింది. కోణార్క్ ఆల‌యం వ‌ద్ద బిక్షాట‌న చేసే మ‌హిళ‌దిగా అనుమానిస్తున్నారు. క‌ర్చీఫ్‌తో గొంతుకు ఉరి బిగించి హ‌త్య చేసిన‌ట్లు గుర్తించారు.

కోణార్క్ ఆల‌యానికి స‌మీపంలోనే రాజారామ్ ఆశ్ర‌మం ఉంది. ఆ ఆశ్ర‌మం ఎదుట పూజా సామాగ్రిని విక్ర‌యించే దుకాణంలో శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలికి మానసిక వ్యాధితో బాధ‌ప‌డుతూ.. నాలుగైదేళ్లుగా రాజారామ్ ఆశ్ర‌మంలో నివ‌సిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన మ‌హిళ కాద‌ని అంటున్నారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహం వ‌ద్ద ఓ మ‌ద్యం బోటిల్ క‌నిపించింది. ఎలాంటి మార‌ణాయుధాలు సంఘ‌టనాస్థ‌లంలో దొర‌క‌లేదు. గొంతుకు క‌ర్చీఫ్ బిగించి ఉండ‌టంతో.. దానితోనే హ‌త్య చేసి ఉంటార‌ని చెబుతున్నారు. హ‌త్య‌కు ముందు- ఆ మ‌హిళపై అత్యాచారం చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here