కారు జాక్ తో ఆమెను రేప్ చేశారు.. మూడు లీటర్ల రక్తం కోల్పోయి చివరకు..!

19 ఏళ్ల యువకుడు 41ఏళ్ల మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. తెలిసిన వాళ్ళ అబ్బాయి కావడంతో ఆమె నమ్మి ఎక్కేసింది. కానీ అతడిలోని మృగాన్ని మాత్రం గుర్తించలేకపోయింది. ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో కారు జాక్ తో ఆమె జననాంగాలపై దాడి చేశాడు. ఆమె శరీరం లోపల తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటుచేసుకుంది.

41 సంవత్సరాల స్వెల్తానా సపొగోవాకు తెలిసిన వాళ్ళు చనిపోయుంటే వారి అంత్యక్రియలకు హాజరు అయింది. అక్కడకు 19 సంవత్సరాల డానిల్ చెస్కో కూడా వచ్చాడు. తిరిగి వెళుతుండగా లిఫ్ట్ ఇస్తాను కారు ఎక్కామని అడిగాడు. తెలిసిన వాళ్ళ కుర్రాడే కదా అని ఆమె కారు ఎక్కింది. వెంటనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులో ఉన్న జాక్ తో ఆమెను బలంగా బాదాడు. ఆమె రక్తపు మడుగులో ఉన్నప్పుడు ఆమెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అదే జాక్ తో ఆమె జననాంగాలపై దాడి చేసి కారును రోడ్డు మీదనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

ఆమె కారులో ఉన్నది చూసిన దారినపోయేవాళ్ళు ఆసుపత్రికి తరలించారు. అతడు చేసిన దాడి వలన ఆమె తీవ్రంగా రక్తాన్ని పోగొట్టుకుంది. దాదాపు మూడు లీటర్లకు పైగా రక్తం పోయింది. ఆమెను బ్రతికించడానికి డాక్టర్లు చేసిన సర్జరీలు ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కొన్ని గంటల పాటూ మృత్యువుతో పోరాడి చివరి శ్వాస విడిచేసింది. డానిల్ చెస్కోను పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన మహిళకు 13ఏళ్ల అమ్మాయి.. 11 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. చెస్కోను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అతడు అంత ఉన్మాదిగా మారడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు.

Rapist and murderer Danil Cheshko

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here