కుమారుడిని చెట్టు కింద నిల్చోబెట్టి తీసిన ఫొటోను జూమ్ చేసి చూసి.. బిగుసుకుపోయింది!

వీకెండ్ హాలిడే సంద‌ర్భంగా త‌న ముగ్గురు పిల్ల‌లతో క‌లిసి స‌ర‌దాగా పార్క్‌కు వెళ్లిందో మ‌హిళ‌. పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకుంది. చేతిలో సెల్‌ఫోన్స్ ఉన్నాయి క‌దా అనేసి, త‌న రెండో కుమారుడిని ఓ చెట్టు కింద‌ నిల్చోబెట్టి, ఫొటోలు తీసింది. ఒకే యాంగిల్‌లో నాలుగైదు ఫొటోల‌ను లాగించింది. సాయంత్రం వర‌కూ పార్క్‌లోనే గ‌డిపి, ఇంటికి చేరుకుందామె త‌న కుటుంబంతో స‌హా.

ఇంటికి వ‌చ్చిన త‌రువాత మొబైల్‌లో షూట్ చేసిన ఫొటోల‌న్నింటినీ లాప్‌టాప్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఆ త‌రువాత ఒక్కో ఫొటోను చూసుకుంటూ వ‌చ్చింది. ఓ ఫొటోను చూస్తూ, ఆమె క‌ళ్లు పెద్ద‌వి అయ్యాయి. భ‌యంతో బిగుసుకుపోయింది. చెమ‌ట‌లు ప‌ట్టాయి. కార‌ణం- ఓ దెయ్యం.

ఏ చెట్టు కింద త‌న రెండో కుమారుడిని నిల్చోబెట్టి నాలుగైదు యాంగిల్స్‌లో ఫొటోలు తీసిందో..ఆ ఫొటోలో క‌నిపించిందో ఓ దెయ్యం. త‌న కుమారుడి వెనుక నిల్చొని ఉంది. కుమారుడి భుజం మీది నుంచి తొంగి చూస్తున్న‌ట్టుగా క‌నిపించింది. ఒకే యాంగిల్‌లో నాలుగైదు ఫొటోలు తీసిన‌ప్ప‌టికీ.. ఒక దాంట్లో మాత్ర‌మే ఆ దెయ్యం క‌నిపించింది. దీనితో బిత్త‌ర‌పోయిందా మ‌హిళ‌.

వాటిని త‌న ఫేస్‌బుక్ ఖాతాలోకి పోస్ట్ చేసింది. ఇంగ్లండ్‌లోని నార్తుంబ‌ర్‌లాండ్ చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. నార్తుంబ‌ర్‌ల్యాండ్‌లో నివ‌సించే ఆ మ‌హిళ పేరు లారా వాట్స‌న్‌. త‌న కుమార్తె ఛార్లోట్టె, కుమారులు బైరిన్, జాక్‌తో క‌లిసి ప్లెస్సీవుడ్ కంట్రీ పార్క్‌కు వెళ్లిన సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప్లెస్సీవుడ్ కంట్రీ పార్క్‌లో ఓ చెట్టు కింద త‌న తొమ్మిదేళ్ల కుమారుడు బైరిన్‌ను నిల్చోబెట్టి ఫొటోలు తీసిన స‌మ‌యంలో ఈ దెయ్యం అత‌ని వెనుక‌ల నిల్చున్న‌ట్టు ఫొటోల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఫొటో షాప్ అంటూ వ‌చ్చిన కామెంట్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఫొటో షాప్ చేసి, జ‌నం దృష్టిని ఆక‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here