భ‌ర్త‌కు ప‌క్షవాతం సోకితే..అత‌ని మిత్రుడిని పెళ్లాడింది: ఆమె చేసిన ప‌నికి అంద‌రూ మెచ్చుకున్నారు!

బీజింగ్‌: భ‌ర్త అనారోగ్యానికి గురైతే భార్య ఏం చేస్తుంది? కోలుకునేంత వ‌ర‌కూ స‌ప‌ర్య‌లు చేస్తుంది. ఆమె ఆమె ధ‌ర్మం. ఇక్క‌డో భార్య మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. భ‌ర్త‌కు ప‌క్ష‌వాతం సోకితే.. అత‌ని స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన ఈ ప‌నికి ఛీత్క‌రించాల్సిన వాళ్లే ప్ర‌శంసించారు.

చాలా మంచి ప‌ని చేశావంటూ భుజం త‌ట్టారు. దీనికి కార‌ణం.. త‌న రెండో భ‌ర్త‌తో క‌లిసి ఆమె అత‌నికి స‌ప‌ర్య‌లు చేయ‌డమే. అంతేకాదు.. పక్ష‌వాతం సోకిన భ‌ర్త బ‌ల‌వంతంతోనే ఆమె ఈ పెళ్లికి సిద్ధ‌ప‌డింది.

త‌న స్నేహితుడిని పెళ్లి చేసుకుని, జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలంటూ భ‌ర్త ప‌దే ప‌దే కోర‌డంతో.. అత‌ను సూచించిన విధంగా పెళ్లి చేసుకుంది.

త‌న రెండో భ‌ర్త‌తో క‌లిసి మొద‌టి భ‌ర్తకు సేవ‌లందించింది. సినిమాల్లో త‌ప్ప నిజ జీవితంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు దాదాపు చూడ‌లేం. ఇలాంటి అరుదైన ఘ‌ట‌న చైనాలోని షాంగ్ఝీ ప్రావిన్స్‌లోని అన్కాంగ్‌లో చోటు చేసుకుంది.

గ్జు గ్జియాన్‌, గ్జై గ్జిపింగ్ 1996లో పెళ్లి చేసుకున్నారు. అన్కాంగ్ సిటీలో స్థిర‌ప‌డ్డారు. వారికి ఓ కుమారుడు. 2002లో గ్జియాంగ్ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన గ్జియాంగ్ న‌డుం కింది భాగం ప‌క్ష‌వాతానికి గురైంది.

అత‌ను మంచంలోంచి లేవ‌లేని ప‌రిస్థితి. త‌న భార్య‌ను ఆనందంగా చూడాల‌నే ఉద్దేశంతో గ్జియాంగ్ రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీనికోసం అత‌ను వైద్యానికి కూడా నిరాక‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ట‌.

 

దీనితో గ్జై గ్జిపింగ్ 2012లో త‌న భ‌ర్త ప్రాణ స్నేహితుడు లియు ఝోంగ్‌కుయ్‌ను పెళ్లాడింది. త‌న ఇంట్లోనే నివ‌సించ‌సాగింది. వారికీ ఓ కుమారుడు పుట్టాడు. త‌న రెండో భ‌ర్త లియుతో క‌లిసి మొద‌టి భ‌ర్త బాగోగుల‌ను చూసుకుంటోంది. ఆమె చేసిన ప‌నికి చుట్టుప‌క్క‌ల‌వారు ప్ర‌శంసించారు. భార్య అంటే ఇలా ఉండాలంటూ కితాబులిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here