నిజమా.. రాత్రి హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోయిన మహిళ కరెంట్ షాక్ తో చనిపోయిందా..?

రాత్రిళ్ళు ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి హెడ్ సెట్ లో పాటలు వింటూ నిద్రపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని తేలింది. తమిళనాడు రాజధాని చెన్నై లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి పాటలు పెట్టుకుంది ఓ మహిళ.. ఆ తర్వాత అలాగే నిద్రపోయింది. తీరా ఉదయాన చూస్తే ఆమె చనిపోయి కనిపించింది. ఆమె చనిపోడానికి కారణం కరెంట్ చాక్ అట..!

మీడియా కథనాల అనుసారం చనిపోయిన మహిళ ఫాతిమా అని.. ఆమె వయసు 46 సంవత్సరాలు.. కంతూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాతిమాకు రాత్రి పూట పాటలు పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉందట.. ఎప్పటిలాగే ఆమె రాత్రి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోయింది.. ఆమె భర్త అబ్దుల్ కలామ్ పక్కన గదిలో నిద్రపోయాడు. ఉదయాన అతడు తన భార్యను నిద్రలేపటానికి రాగా ఆమె కదలలేదు. వెంటనే అతడు ఆమెను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు చనిపోయిందని చెప్పారు.

ఆమె శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించగా అందులో ఆమె ఎలెక్ట్రిక్ షాక్ వలనే చనిపోయిందని చెప్పారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here