భర్త ‘షవర్మ’ కొనివ్వలేదని పెళ్ళైన 40రోజులకే భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ..!

షవర్మ.. ఈ వంటకానికి గత కొన్నేళ్ళుగా భీభత్సమైన పాపులారిటీ వచ్చింది. మాంసాన్ని బాగా కాల్చి.. ఓ రోల్ లో చుట్టిస్తూ ఉంటారు.. లేదా ప్లేట్ షవర్మ కూడా ఇస్తారు. చాలా మంది రోల్ లాగా తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. మన హైదరాబాద్ లో కూడా బాగా ఫేమస్..!

అయితే ఓ మహిళ తన భర్త షవర్మ కొనివ్వలేదని విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఈజిప్ట్ కు చెందిన ఓ మహిళ తన భర్తను షవర్మ కొనివ్వమని అడిగింది. ఏమైందో ఏమో కానీ అతడు షవర్మ తీసుకొని రాకుండా జూస్ మాత్రమే తీసుకొని వచ్చాడు. తాను ఇష్టపడింది తీసివ్వలేదన్న కారణంతో ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అది కూడా పెళ్ళి అయి కేవలం 40 రోజులు మాత్రమే అయింది. వీరిద్దరూ పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి అయినప్పటి నుండి వారికి మనస్పర్థలు ఉన్నాయి.. చివరికి షవర్మ దగ్గర మొదలైన గొడవ కూడా వారు వేరవ్వడానికి దారి తీసింది. దీంతో ఆమె విడాకులు ఇచ్చేసింది. ఆమె భర్త బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడడట..! బయటకు వెళ్ళితే డబ్బులు ఖర్చు అని ఎక్కువగా భావిస్తుండడంతో ఆమె విడిపోవడానికే నిర్ణయించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here