ఓన‌ర్ సెల్‌ఫోన్‌లో మునిగిపోతే..కారు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగింది! ఎలాగంటారా?

ఫ్లోరిడా: `ఒక‌లూసా`. అని విన‌డానికి జ‌పాన్ పేరులా అనిపిస్తున్నా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటుంది ఈ న‌గ‌రం. ఆ సిటీలోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో క‌నిపించింది ఈ నీలం రంగు ఖ‌రీదైన కారు. కారు స్విమ్మింగ్‌పూల్‌లోకి ఎలా వెళ్లింద‌నే క‌దా మీ అనుమానం? దీనికి ఓ కార‌ణం ఉంది. ఓ చిన్న క‌థ కూడా ఉంది.

 

సెల‌వురోజు కావ‌డంతో ఆదివారం సాయంత్రం ఓ వ్య‌క్తి త‌న కుటుంబంతో స‌హా బ‌య‌టికెళ్ల‌డానికి గ్యారేజీ నుంచి కారును బ‌య‌టికి తీశారు. అలా కారును బ‌య‌టికి తీయ‌గానే.. ఆయ‌న భార్య తాను న‌డుపుతానంటూ స్టీరింగ్‌ను చేతికి అందుకున్నారు. స‌రేనంటూ పిల్ల‌ల‌తో పాటు బ్యాక్‌సీట్లో కూర్చున్నారాయ‌న‌.

త‌న హ్యాండ్‌బ్యాగ్ మ‌రిచిపోవ‌డంతో దాన్ని తెస్తానంటూ ఆమె ఎక్క‌డ ఉన్న కారును అలాగే వ‌దిలేసి ఇంట్లోకి తుర్రుమంటూ ప‌రుగెత్తారు. అక్క‌డిదాకా బాగానే ఉంది. హ్యాండ్‌బ్యాగ్ తెచ్చుకునే తొంద‌ర‌లో హ్యాండ్ బ్రేక్ వేయ‌డాన్ని మ‌రిచిపోయారు. దీని దెబ్బ‌కు కారు మెల్లిగా దొర్లుకుంటూ, దొర్లుకుంటూ నేరుగా స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లి ప‌డిపోయింది.

విచిత్ర‌మేంట్రా అంటే- ఆ స‌మ‌యంలో ఆమె భ‌ర్త‌, పిల్లలు కారులోనే ఉన్న‌ప్ప‌టికీ.. దీని మీద ధ్యాస పెట్ట‌లేదు. ఎందుకంటే.. వారు సెల్‌ఫోన్‌లో మునిగిపోయి ఉన్నారు కాబ‌ట్టి. వార‌లా సెల్‌ఫోన్‌లో మునిగిపోగా.. కారు ఇలా స్విమ్మింగ్ పూల్‌లో మునిగింది. నీళ్ల‌ల్లో ప‌డ్డ త‌రువాత గానీ వారు తేరుకోలేదు.

వెంట‌నే డోర్ తెరిచి బ‌య‌ట ప‌డ్డారు. కారు మాత్రం మునిగి పోయింది. వెంట‌నే స్థానిక పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే వారి ఇంటికి చేరుకున్న పోలీసులు.. దాన్ని బ‌య‌టికి తీశారు. ఈ సంద‌ర్భంగా ఒక‌లూసా పోలీసులు తీసిన ఫొటోలే ఇవి. వారే ఈ పిక్‌ల‌ను త‌మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here