వివాహేత‌ర సంబంధం! ఎక్క‌డికి దారి తీసిందో!

వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించిన ఓ మ‌హిళ‌.. చివ‌రికి క‌ట‌క‌టాల పాలైంది. ప్రియుడితో క‌లిసి త‌న భ‌ర్త‌ను హ‌త్య చేయించిన ఆమెకు న్యాయ‌స్థానం యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది. భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డానికి త‌న ప్రియుడితో క‌లిసి కుట్ర ప‌న్నింది. కిరాయి గూండాల‌ను పెట్టి, వారికి డ‌బ్బులు ఇచ్చి మ‌రీ హ‌త్య చేయించింది. ఆమె పేరు సుక‌న్య‌.

ఆమెతో పాటు భ‌ర‌త్‌, అబ్దుల్ ర‌జాక్‌, మ‌ణిరాజు, వాసుల‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర జిల్లా న్యాయ‌స్థానం. చిత్తూరు జిల్లాకు చెందిన గ‌ణేష్ అనే యువ‌కుడు కొన్నాళ్లుగా రామ‌న‌గ‌ర తాలూకా వ‌డ్డెర‌హ‌ళ్లిలో భార్య సుక‌న్య‌తో క‌లిసి నివ‌సించేవాడు. సుక‌న్య‌కు భ‌ర‌త్ అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. త‌మ‌కు అడ్డుగా ఉన్న భ‌ర్త గ‌ణేష్‌ను అంతమొందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2015 ఏప్రిల్ 5వ తేదీన గ‌ణేష్‌ను హ‌త్య చేయించారు. గణేష్‌ను హ‌త్య చేయించ‌డానికి వారిద్ద‌రూ అబ్దుల్ ర‌జాక్‌, మ‌ణిరాజు, వాసుల‌కు అయిదు ల‌క్ష‌ల రూపాయ‌ల సుపారీ ఇచ్చారు.

గ‌ణేష్‌ను హ‌తమార్చిన త‌రువాత వారు రాష్ట్రం వ‌దిలి పారిపోయారు. సుమారు ఆరు నెల‌ల త‌రువాత నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. అంద‌రికీ యావ‌జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రామ‌న‌గ‌ర ఫ‌స్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయ‌స్థానం సోమ‌వారం తీర్పు ఇచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here