అల్ల‌రి పిల్ల కోతి..ఎంత ప‌ని చేసింది! యువ‌తి టాప్ లాగేసింది!

బ్యాంకాక్‌: కోతులు ఎన్ని అల్ల‌రి ప‌నులు చేస్తాయో మ‌నకు తెలుసు. చూడ్డానికి ముచ్చ‌టేస్తుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో శృతి మించుతుంటాయి కూడా. అందుకే కోతి ప‌నులు చేయొద్దంటూ చెబుతుంటారు పెద్ద‌లు. ఇక్క‌డ కూడా ఓ పిల్ల కోతి త‌న బుద్ధి పోనిచ్చుకోలేదు. దారిన పోతున్న ఓ ప‌ర్యాట‌కురాలిపై అమాంతం దూకేసింది. ఆమె ధ‌రించిన టాప్ లాగేసింది.

ఆ ప‌ర్యాట‌కురాలు చురుగ్గా స్పందించింది కాబ‌ట్టి స‌రిపోయింది. లేకుంటేనా! ఈ ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌మ‌యిలో చోటు చేసుకుంది. ఆ ప‌ర్యాట‌కురాలి పేరు బ్యోమ‌న్‌. అమెరికాకు చెందిన ప‌ర్యాట‌కురాలు. జ‌న్మ‌త‌: బ‌్రిట‌న్‌కు చెందిన బ్యోమ‌న్ అమెరికా లాస్ ఏంజిలిస్‌లో చ‌దువుకుంటోంది. త‌న స్నేహితుల‌తో క‌లిసి థాయ్‌లాండ్ ప‌ర్యాట‌న‌కు వెళ్లింది.

చియాంగ్ మ‌యిలోని అట‌వీ ప్రాంతంలో వెళ్తుండ‌గా.. అక్క‌డ బంధించి ఉన్న ఓ పిల్ల‌కోతి ఉన్న‌ప‌ళంగా బ్యోమ‌న్‌పై దూకేసింది. ఆమె ధ‌రించిన షార్ట్‌, టాప్ ప‌ట్టుకుని లాగేసింది. ఈ లాగ‌డంలో టాప్ కిందికి జారింది. దీనితో ఆమె అందాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.

ఆ స‌మ‌యంలో ఆమె అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం, కోతిని క‌ట్టేసి ఉండ‌టంతో బ‌తికి పోయింది. ఈ దృశ్యాన్ని ఆమె స్నేహితులు సెల్ వీడియోలో బంధించారు. ఆ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here