చేయి తెగిపడి పోవడమే కాకుండా..!

వాహనాల్లో వెళ్ళే సమయంలో మన చేతులను తలను బయటకు పెట్టకూడదని చెబుతూ ఉంటారు. చాలా మంది ఆ మాటలను సీరియస్ గా తీసుకున్నప్పటికీ కొందరు పొరపాటుగానో.. ఏమరపాటుగానో చేతులను బయట పెడుతూ ఉంటారు. అయితే అవి ఎంత పెద్ద ప్రమాదానికి కారణం అవుతాయో మనం అసలు ఊహించలేము. ఇప్పుడు ఓ మహిళ అలా చేయి బయట పెట్టడం వలన జరిగిన ప్రమాదంలో ఏకంగా చేతినే కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్, చేవెళ్ళ మండలం కందవాడ వద్ద చోటుచేసుకుంది. తెగి పడిన చేయి రోడ్డు మీదనే ఉండిపోయింది.


రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ హమీద్ భార్య ఫరీనా బేగం చేతిని కోల్పోయింది. దంపతులిద్దరూ కలిసి తమ నలుగురు పిల్లలతో కొడంగల్‌కు ఆటోలో వెళ్తున్నాడు. చేవేళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనం.. ఆటోను ఢీకొట్టింది. ఈ సమయంలో ఫరీనా తన చేతిని ఆటో బయటకు పెట్టడంతో.. ఆమె కుడి చేతి తెగిపోయింది. మరో చిన్నారి కూడా గాయపడింది. వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఫరీనా మార్గమధ్యంలోనే మృతి చెందింది. చిన్నారికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై పడి ఉన్న ఫరీనా చేతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. చేయి మాత్రమే పోయిందేమోనని మొదట బంధువులు అనుకున్నారు.. కానీ ఫరీనా కూడా చనిపోయిందని తెలుసుకొని బంధువులంతా దుఃఖంలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here