మీరు ఓ బట్టల షాప్ కు షాపింగ్ కు వెళ్ళారు. అక్కడ ఉన్న ఓ జీన్స్ ప్యాంట్ మీకు తెగ నచ్చేసింది. ట్రయల్ చూసుకున్నారు. అది కూడా బాగా సెట్ అయిపోయింది. అప్పుడు మీరు షాపింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళారు. మీకు నచ్చిన దానికి బిల్లు వేయమని అడిగారు. అప్పుడు ఆ షాపింగ్ మాల్ మేనేజర్ ఇది మా షాపింగ్ మాల్ లోదే కాదు.. ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది మీకు నచ్చింది అని అంటే ఎంత హేళనగా.. పరువు పోయినట్లు అనిపించదూ..!
tried on a bra in Primark & it was nice so I went to buy it but there was no tag so the guy went to find a supervisor to get a code, comes back & goes "this isn't ours, it's a swap" so someone has literally left THEIR OWN BRA on a hanger in order to shoplift one AND I TRIED IT ON
— natalie (@n_brayshaw) January 31, 2018
అయితే పైన చెప్పిందే నటాలీకి కూడా చోటుచేసుకుంది. అది కూడా ఇన్నర్ వేర్ విషయంలో..! ప్రైమాక్స్ స్టోర్ కు నటాలీ వెళ్లింది. అక్కడ ఉన్న లోదుస్తులలో ఓ బ్రా కనిపించింది. ఆ బ్రా తనకు నప్పుతుందని భావించిన నటాలీ, దాని మీద రేటు లేకపోవడాన్ని చూసి స్టోర్ సూపర్ వైజర్ ను ఆశ్రయించింది. అతను కొద్ది సేపు దాని గురించి చెక్ చేసి “ఇది మా షాప్ లోని బ్రా కాదు. దీన్ని ఎవరో కావాలనే ఇక్కడ వదిలెళ్లారు. ఎవరిదో వాడేసిన బ్రా హ్యాంగర్ కు తగిలించి, కొత్తది తీసుకుపోయారు” అని చెప్పాడు. ఎవరో వాడేసిన బ్రాను తాను ధరించి చూసుకుని, తెచ్చానా? అంటూ నటాలీ తన అనుభవాన్ని ట్విట్టర్ లో తెలిపింది. అంతే పాపం నటాలీ అంటూ నెటిజన్లు ఆ పోస్ట్ ను తెగ వైరల్ చేసేశారు. ఎంతగా అంటే 49వేల మంది రీపోస్ట్ చేశారు. 245వేలమంది దాన్ని లైక్ చేశారు.