మహిళ పీరియడ్స్ గురించి మాట్లాడిందని ఎమిరేట్స్ విమానం నుండి దించేశారు..!

మహిళల పీరియడ్స్ గురించి వచ్చిన ప్యాడ్ మాన్ చిత్రం భారత్ లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. పీరియడ్స్ గురించి మనమంతా ఒక అపోహలో బ్రతుకుతున్నామని ఆ సినిమా ద్వారా చెప్పించారు. అయితే అలాంటి అపోహల్లోనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ మహిళ తన పీరియడ్స్ గురించి విమానంలో మాట్లాడడం ఆ విమాన సిబ్బంది చెవుల్లో పడింది. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెను విమానంలో నుండి దించేశారు.

బర్మింగ్హాం ఎయిర్ పోర్ట్ నుండి 24సంవత్సరాల బెత్ ఇవాన్స్, తన బాయ్ ఫ్రెండ్ జాషువా మోరాన్ తో కలిసి దుబాయ్ కు వెళుతోంది. కొన్ని నిమిషాల్లో ఫ్లైట్ టేకాఫ్ అవుతుందనగా బెత్.. జాషువాతో ఏదో పిచ్చాపాటీగా మాట్లాడుతోంది. ఆ మధ్యలో తనకు చిన్నగా కడుపునొప్పి మొదలైందని.. అవి పీరియడ్స్ ఏమైనా అయ్యుండచ్చు అని చెప్పింది. ఈ మాట విన్న ఎయిర్ హోస్టెస్ విషయాన్ని సిబ్బందికి చెప్పింది. వారు ఫోన్ లోనే మెడికల్ టీమ్ తో మాట్లాడి ఆమెను దింపేశారు.

ఈ ఘటనతో బెత్ చాలా బాధపడిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది. ఎమిరేట్స్ విమాన సిబ్బంది చేసిన పనికి తమ మనసు చాలా గాయపడిందని ఆమె చెప్పుకొచ్చింది. విమాన టికెట్లు రీఫండ్ కూడా చేయలేదట..! కనీసం విమానంలో ఉన్న మెడికల్ టీమ్ చెక్ చేసి విమానంలో ఎగరడానికి వీలు లేదు అని చెప్పింటే తాము ఒప్పుకునే వాళ్ళమని.. తనకు పెద్దగా కడుపునొప్పి లేకున్నా కూడా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి తమను దింపేశారని బాధపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here