మూడు రోజులుగా భ‌ర్త ఇంట్లో లేడు! ఇదే అద‌నుగా భావించి..మ‌రొక‌రిని పెళ్లాడింది!

రూర్కేలా: పెళ్లి కుమార్తె డ్రెస్‌లో మెరిసిపోతూ క‌నిపిస్తోన్న ఆ మ‌హిళ పేరు స్మ‌ర‌ణికా నాయ‌క్‌. పెళ్లి చేసుకోవ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు ఆమె దిగిన సెల్ఫీ ఇది.

ఈ సెల్ఫీ త‌రువాత హ్యాపీగా ఆమె పెళ్లి పీట‌లు ఎక్కింది. పెళ్లి చేసుకుంది. ఇందులో త‌ప్పేముంది? అనే డౌట్ రావొచ్చు. భ‌ర్త జీవించే ఉండ‌గా, అత‌ను ఊరిలో లేని స‌మ‌యంలో, అత‌నికి తెలియ‌కుండా, వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం త‌ప్పు కాదేటి?

ప్రియరంజ‌న్ అనే వ్య‌క్తిని త‌న భార్య రెండో పెళ్లి చేసుకుంద‌నే విష‌యం తెలిసి, ఉరుకులు ప‌రుగులు పెట్టుకుంటూ ఇంటికొచ్చాడ‌త‌ను. అప్ప‌టికే ఆమె త‌న రెండో భ‌ర్తతో వెళ్లిపోయింది కూడా. ద‌గ్గ‌ర్లోని ఓ హోట‌ల్‌లో రిసెప్ష‌న్‌ ఏర్పాటు చేశార‌ని తెలుసుకుని అక్క‌డికి వెళ్లాడు.

స్మ‌ర‌ణిక‌తో తాను దిగిన ఫొటోలు, పెళ్లి ఫొటోలు అన్నీ ప్రియ‌రంజ‌న్‌కు చూపించాడు. తాను ఊరిలో లేని స‌మ‌యంలో త‌న భార్య స్మ‌ర‌ణిక రెండో పెళ్లి చేసుకుందని అంద‌రికీ చెప్పాడు. ప‌నిలోప‌నిగా ర‌ఘునాథ ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లోనూ ఆమె మీద ఫిర్యాదు చేశాడు.

దీనితో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్మ‌ర‌ణిక రెండో భ‌ర్త ప్రియ రంజ‌న్ కూడా ఆమెపై కేసు పెట్టాడు. త‌న‌ను మోసం చేసిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని రూర్కేలాలో చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here