ఇక్కడ పెళ్ళి కొడుకులా ఉన్నది ఎవరో.. దాని వెనుక ఉన్న స్టోరీ ఏమిటో తెలుసా..?

ఈ ఫోటో చూడండి.. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎంత ముచ్చటగా ఉన్నారో అని అనుకుంటారా.. అయితే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు అబ్బాయే కాదు అంటే అసలు నమ్మరేమో..! కానీ అదే నిజం ఇక్కడ ఉన్న పెళ్ళి కొడుకు పేరు కృష్ణ సేన్.. అబ్బాయిలా మోసం చేసి ఇప్పటిదాకా ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. కృష్ణ సేన్ అసలు పేరు స్వీటీ సేన్ అని తెలియగానే అందరూ అవాక్కయ్యారు.

ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నైనితాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జన్మేజయ్ ఖండూరి స్వీటీ సేన్ లీలల గురించి మీడియా ముందు పెట్టాడు. స్వీటీ సేన్ మగాడిలా నటించి ఇద్దరు యువ‌తుల‌ను పెళ్లి చేసుకుంది. స్వీటీ కృష్ణ సేన్ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో అబ్బాయి పేరుతో ఫేక్ ఐడీ ఓపెన్ చేసి, అమ్మాయిల‌ను ఫ్రెండ్ చేసుకునేది.

2014లో ఆమె వ‌ల‌లో ఓ యువ‌తి ప‌డింది. ఆ యువ‌తిని పెళ్లి చేసుకోవడానికి కాత్‌గోడమ్ ప్రాంతానికి వచ్చి, తాను అలీగఢ్‌లో ఉన్న ఓ సీఎఫ్‌ఎల్ బల్బ్ వ్యాపారవేత్త కొడుకునని చెప్పింది. ఆమెను వివాహం చేసుకున్న త‌రువాత వ్యాపారం చేయ‌డానికి డ‌బ్బు కావాల‌ని న‌మ్మించి, ఎనిమిదిన్నర లక్షలు తీసుకుంది. 2016 ఏప్రిల్‌లో మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకుంది. తాను పెళ్లి చేసుకుంది మగాడిని కాదని ఆమెకు తెలియడంతో డబ్బు ఇస్తాన‌ని చెప్పి సైలెంట్ గా ఉంచాడు. అయితే, మొదటి భార్య కట్నం వేధింపుల కేసు పెట్టడంతో హల్ద్వానీ పోలీసులు కృష్ణ సేన్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణ మొదలుపెట్టిన కొన్ని నిమిషాల్లో యువకుడు కాదు యువతి అని తేల్చారు.

పోలీసుల విచారణలో తాను చిన్నప్పటి నుండి మగవాడిలా పెరిగానని.. తనను తాను మగవాడినే అని అనుకునేదానినని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుండే తాను అబ్బాయిల్లా హెయిర్ కట్ చేయించుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే బైక్ నడపడం.. సిగరెట్లు తాగడం ముందుగానే అలవాటు అయిపోయాయని చెప్పుకొచ్చింది. పెళ్ళి అయిన తర్వాత కూడా తాను తన భార్యలను ముట్టుకోనిచ్చేవాన్ని కాదని చెప్పుకొచ్చింది. సెక్స్ టాయ్స్ ను ఉపయోగించి వారిని సుఖపెట్టేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే స్వీటీ సేన్ పెళ్ళికి హాజరు అయిన బంధువుల కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here