ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు గ్రామంలో ఘాతుకం

ఒడిశాలో దారుణం. మ‌హిళ‌ల‌కు రక్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. గ‌జ‌ప‌తి జిల్లాలో, ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉండే రాయ‌గ‌ఢ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఒడిశా ఆర్మ్‌డ్ పోలీస్ విభాగానికి చెందిన జ‌వాన్ త‌న‌పై అత్యాచారం చేసిన‌ట్టు బాధిత మ‌హిళ రాయ‌గ‌ఢ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నెల 16వ తేదీన రాత్రి 10:30 గంట‌ల‌కు త‌న భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో.. విచార‌ణ పేరుతో వ‌చ్చిన ఈశ్వ‌ర్ అనే జ‌వాన్ త‌న‌పై అఘాయిత్యం చేసిన‌ట్టు లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు చేశారు.

ఈ విష‌యాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడ‌ని, అందుకే ఫిర్యాదు చేయ‌డంలో జాప్యం జ‌రిగింద‌ని చెప్పారు. ఆర్ ఉద‌య‌గిరి పోలీస్‌స్టేష‌న్‌కు అటాచ్‌గా ప‌నిచేస్తోన్న ఈశ్వ‌ర్‌ను అరెస్ట్ చేస్తామ‌ని రాయ‌గ‌ఢ పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here