పసుపు వాడడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ నుండి బయటపడ్డ మహిళ.. పసుపు గొప్పతనం..!

పసుపు వాడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే..! కానీ పసుపుకు ఏకంగా క్యాన్సర్ ను రూపుమాపే శక్తి ఉందని తేలింది. అయిదు సంవత్సరాల పాటూ క్యాన్సర్ తో పోరాడుతూ వస్తున్న మహిళ చివరకు పసుపును తీసుకోవడం వలన తన బాధలు తగ్గాయని చెప్పుకొచ్చింది.

67 సంవత్సరాల డినేకే ఫెర్గ్యూసన్ అనే మహిళకు ఇప్పటివరకూ మూడు రౌండ్లు కీమో థెరపీ జరిగింది. అలాగే నాలుగు సార్లు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఆమెకు మెలోమా క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆమెకు పలు చికిత్సలు జరిపిన తర్వాత కూడా విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతూ ఉండేది. కొన్ని కొన్ని సార్లు ఆమె స్పృహ తప్పి పడిపోతూ ఉండేది. ఆమె కోలుకోవడం కష్టమేనని వైద్యులు కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె శరీరంలోని ప్లాస్మా సెల్ కౌంట్ బాగా పెరిగిపోయింది. అలాగే ఆమె జీవితంలో కూడా బాగా తేడా వచ్చింది.

అందుకు కారణం పసుపేనని చెప్పింది ఫెర్గ్యూసన్.. ప్రతీ రోజు తాను ఎనిమిది గ్రాముల పసుపు ట్యాబ్లెట్లు వేసుకునేదాన్నని ఆమె వెల్లడించింది. ఎనిమిది సంవత్సరాల ట్రీట్మెంట్ ద్వారా రాని స్వస్థత తనకు పసుపు తీసుకోవడం ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను మెల్ల మెల్లగా డాక్టర్లు ఇచ్చిన మందులు వాడడం కూడా మానేశానని చెప్పుకొచ్చింది. ఆమెకు జరిగిన ఈ విషయంపై డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ కేస్ రిపోర్ట్స్ లో ఫెర్గ్యూసన్ గురించి కూడా ప్రస్తావించారు. పసుపు వలన అల్జీమర్లు, గుండె సంబంధిత వ్యాధులు, డిప్రెషన్ దరిచేరవని భారతీయులు ఎప్పటి నుండో నమ్ముతూ వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here