భర్తను కొడుతూ ఉంటే భరించలేకపోయిన భార్య.. ఏమి చేసిందంటే..!

కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ మహిళ తన భర్తపై దాడి చేస్తోన్న వారిపై తుపాకీతో కాల్పులు జరిపి వారిని పరుగులు తీయించింది ఓ భార్యామణి. అప్పట్లో ఆ వార్త సంచలనం అయ్యింది. ఇప్పుడు హర్యానాలో ఓ మహిళ తన భర్తను కొందరు మగవాళ్ళు కొడుతూ ఉంటే పరిగెత్తుకొని వచ్చింది. తన చేతికి దొరికిన కర్రను తీసుకొని వాళ్ళ మీదకు దూసుకెళ్ళింది.

హర్యానా యుమునా నగర్‌లో ఓ వ్యక్తిని కింద పడేసి కొందరు చితక్కొడుతున్నారు. ఇంతలో విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి భార్య కర్రను తీసుకొని వచ్చి వారిపై తిరగబడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నేషనల్ లేవల్ లో పాపులర్ అయింది. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు కొట్టారు.. కొట్టిన వాళ్ళు ఎవరు.. పడిపోయిన ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ భర్తను కాపాడడానికి ఆ మహిళ చూపించిన తెగువను మాత్రం అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here