మొరగలేదు.. కుక్కలు తినే తిండీ తినలేదు.. డబ్బులు పెట్టి కొన్న కుక్కపిల్ల కాస్తా కుక్కే కాదు..!

కొన్ని కొన్ని సార్లు మోసపోతూ ఉంటాము కానీ.. మరీ ఇంతగానా..! కుక్క పిల్ల అని చెప్పి నక్క పిల్లను అమ్మేశారు ఓ మహిళకు. చైనా మహిళ గత కొద్ది రోజులుగా పెంచుకుంటున్న తన కుక్క కాస్తా నక్క అని తేలిందట. ముందు నుండి ఆమెకు దాని మీద అనుమానం ఉండేదట.. ఎప్పుడు కూడా అది మొరగలేదు.. అంతేకాకుండా కుక్కలకు పెట్టే తిండి అది తినేది కాదట.. అనుమానం వచ్చిన ఆమె ఎంక్వైరీ చేయగా అది కుక్క కాదు నక్క అని తేలింది.

వాంగ్ కుక్కలంటే ఎంతోఇష్టం. దీంతో గతేడాది చాలా ఇష్టపడి ఓ షాపు నుంచి చిన్న కుక్కపిల్లను కొనుకొక్కుని ఇంటికి తీసుకొచ్చింది. అందుకు 12 వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కొంది. జపనీస్ స్పిట్జ్ అనే జాతికి చెందిన కుక్కలు కాస్త బొచ్చు కుక్కను పోలినట్లే ఉంటాయి. కానీ రాను రానూ ఆమె ఆ కుక్కలో మార్పులను గమనించసాగింది. మూడునెలల తర్వాత కనీసం కుక్క లాగే ప్రవర్తించేది కాదట.. దాని వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా ఉండడంతో ఓ జూ సిబ్బంది దగ్గరకు తీసుకువెళ్ళింది. వాళ్ళు అది కుక్క కాదు నక్క అని తేలడంతో వాంగ్ షాక్ తింది. ఇన్నాళ్ళూ పెంచిన ఆ నక్క పిల్లను చేసేది లేక జూకు అప్పగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here