కాటికి కాళ్లు చాపుకొన్న వృద్ధురాలిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బుల్లెట్ల వ‌ర్షం: శ‌రీరంలో 10 బుల్లెట్లు!

ముగ్గురు వ్య‌క్తులు అతి స‌మీపం నుంచి అంటే.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో గుళ్ల వ‌ర్షం కురిపిస్తోన్న శ‌తృవు ఏ గ్యాంగ్‌స్ట‌రో కాదు.. ఏ మాఫియా లీడ‌ర్ అంతకంటే కాదు. కాటికి కాళ్లు చాపుకొన్న ఓ వృద్ధురాలు.

గ‌ట్టిగా నాలుగు అడుగులు కూడా వేయ‌లేని 65 సంవ‌త్స‌రాల వ‌యోధిక వృద్ధురాలు. అయిన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా అతి స‌మీపం నుంచి కాల్చి చంపారు. ఏకంగా ప‌ది రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ఆమె ఒంటిలో 10 బుల్లెట్లు దూసుకెళ్లాయి.

ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో చోటు చేసుకుంది. ఆ వృద్ధురాలితో పాటు ఆమె కుమారుడిని కూడా కాల్చిచంపారు. ఆమెతో పాటు కూర్చుని క‌బుర్లు చెబుతోన్న మ‌హిళ‌ను వ‌దిలివేశారు. ఈ మార‌ణ‌కాండ సృష్టించ‌డానికి కార‌ణం ఉంది.

ఆ వృద్ధురాలితో పాటు ఆమె కుమారుడు ఓ హ‌త్య‌కు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు. అందుకే వారిద్ద‌ర్నీ హ‌త‌మార్చారు. హ‌తుల పేర్లు నిచ్ఛేత‌ర్ కౌర్‌. 65 సంవ‌త్స‌రాల వృద్ధురాలు. మరో మహిళలతో కలిసి ఇంటి వ‌ద్ద మంచంపై కూర్చుని కబుర్లు చెబుతూ కూర్చున్నారు.

అదే స‌మ‌యంలో ముగ్గురు వ్యక్తులు తుపాకులతో వచ్చి నిచ్ఛేత‌ర్ కౌర్‌పై కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి ఏకంగా పది బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీనితో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. నిచ్ఛేత‌ర్ కౌర్‌తో క‌బుర్లు చెబుతున్న మ‌రో మ‌హిళ‌ను హెచ్చ‌రించి, వ‌దిలివేశారు.

ఆమె కుమారుడు బ‌ల్వింద‌ర్‌ కూడా కాల్చి చంపారు. అత‌ని మృతదేహాన్ని ఊరి చివరిలోని ఓ కారులో దాచారు. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

2016లో నిచ్ఛేత‌ర్ కౌర్‌ భర్త హత్యకు గురయ్యాడు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి గురువారం నిచేత్తర్‌, కుమారుడు న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here