స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల కాలు పోగొట్టుకుంది.. ఎలాగంటారా?

స్మార్ట్‌ ఫోన్ వ్య‌స‌నం ఓ యువ‌తిని విక‌లాంగురాలిగా మార్చింది. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మ‌రిచిపోతుంటారు జ‌నం. ఈ యువ‌తి కూడా అంతే. సెల్‌ఫోన్‌లో మునిగిపోయి.. తాను ఎక్క‌డ ఉన్నాన‌నే విష‌యాన్ని కూడా విస్మ‌రించింది.

దీని ఫ‌లితం.. త‌న కాలును పోగొట్టుకుంది. ఈ ఘ‌ట‌న షాంఘైలో చోటు చేసుకుంది. షాంఘైలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆమె. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికెళ్ల‌డానికి లిఫ్ట్ వ‌ద్ద‌కు చేరుకుంది.

చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్‌ చూసుకుంటూనే… లిఫ్ట్ లోపల అడుగు పెట్టింది. అప్పటికే లిఫ్ట్‌ డోర్లు మూసుకు పోయాయి.

ఫోన్ ధ్యాస‌లో ఉండ‌టంతో ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్‌ వేగంగా కిందికి కదిలింది.

లిఫ్ట్‌ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే నుజ్జునుజ్జ‌యింది. ఆమె లిఫ్ట్ లోప‌ల ఉండ‌గా.. కాలు లిఫ్ట్ బ‌య‌టే ఉండిపోయింది. లిఫ్ట్‌లో అమ‌ర్చిన సీసీటీవీలో ఈ ఉదంతం మొత్తం రికార్డ‌య్యింది. ఆ యువ‌తిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here