పెళ్లయిన 21వ రోజు..!

బెంగ‌ళూరు: పెళ్ల‌యిన మూడు వారాల వ్య‌వ‌ధిలోనే న‌వ వ‌ధువు ఒక‌రు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. బెంగ‌ళూరు కేఆర్ పుర స‌మీపంలోని రైల్వే క్వార్ట‌ర్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు ర‌మిత‌. ప్ర‌తిష్ఠాత్మ‌క వోల్వో సంస్థ‌లో ఆమె ప‌ని చేస్తున్నారు. రైల్వే ఉద్యోగి న‌రేష్‌ను ఆమె ప్రేమించారు.

స‌రిగ్గా 21 రోజుల కింద‌టే ఆమె త‌మ పెద్ద‌ల ఆశీస్సుల‌తో పెళ్లాడారు. నరేష్ రైల్వే ఉద్యోగి కావ‌డంతో ఆయ‌న‌తో క‌లిసి కేఆర్ పురం రైల్వే క్వార్ట‌ర్స్‌లో నివాసం ఉండ‌సాగారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆమె అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు.

ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె క‌నిపించారు. ఆమె మృత‌దేహాన్ని చూసిన కుటుంబ స‌భ్యులు కేఆర్ పురం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ర‌మిత‌ను హ‌త్య చేసి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు అనుమానాస్ప‌ద కేసుగా న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here