అక్కడంతే.. క్యాష్ కోసం కార్ కింద కూడా పడాలని అనుకుంటూ ఉంటారు..!

కొందరు డబ్బుల కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉంటారు.. అలాగని కష్టపడి సంపాదించాలని అనుకోరు.. ఈజీగా డబ్బులు ఎలా రావాలి అనే ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో అయితే కావాలనే కారు కింద పడడం.. కారు డ్రైవ్ చేస్తున్న వారిని కేసుల్లో బుక్ చేస్తాం అని బెదిరించి డబ్బులు లాగుతూ ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారని చాలా మంది డ్యాష్ క్యామ్ లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ కెమెరాల వలన కారు ముందు ఏమి జరుగుతోందో రికార్డ్ అవుతూ ఉంటుంది.

CEN

తాజాగా ఓ యువతి కారు ముందుకు వచ్చి దూకింది. కావాలనే ఆమె అలా చేసినట్లు స్పష్టంగా కెమెరాలో రికార్డు అయింది. దాదాపుగా కారు నిలిచిపోయే సమయానికి వచ్చి ఆమె కారు ముందుకు దూకింది. దాని మీదకు దూకి.. అలా కిందకు పడిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఆమెను చూడగా గట్టిగా అరుస్తూ తనను చంపేయబోయారు అని అరిచింది. వెంటనే డబ్బులు ఇవ్వాలని లేదంటే పోలీసుల వద్దకు వెళ్దామని వారిని డిమాండ్ చేసింది.

పోలీసుల వరకూ విషయం వెళ్ళగా ఆమెదే తప్పు అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ వీడియో కూడా పోలీసులకు సాక్ష్యంగా పనికి వచ్చింది. డబ్బుల కోసం ఆమెనే ఈ పని చేసిందని పూర్తిగా వాళ్లకు అర్థం అయిపోయింది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఆమె చేసిన పనికి నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటన రష్యా లోని మాస్కోలో చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here