సత్య సాయి బాబా భక్తురాలిగా మారిన విదేశీ వనిత.. ఉపవాస దీక్ష చేపట్టి మరణించింది..!

రష్యాకు చెందిన 35 సంవత్సరాల ఎలెనా స్మొరోదినోవా విడాకుల అనంతరం సత్య సాయి బాబా భక్తురాలిగా మారిపోయింది. రష్యాలోని నొవోసిబిరిస్క్ లో ఉన్న సాయి బాబా ఆశ్రమంలో భక్తురాలిగా రెండు సంవత్సరాలుగా ఉంటోంది. ఆమె భక్తురాలిగా మారిన తర్వాత తన స్నేహితులను కూడా కలవడం మానేసింది. అయితే ఆ ఆశ్రమంలోని పెద్దాయన చెప్పిన ఉపవాస దీక్ష చేస్తూ ఎలెనా మరణించిందని మిర్రర్ వెబ్ సైట్ ప్రచురించింది. భక్తురాలిగా చేరిన తర్వాత ఎలెనాలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆమె స్నేహితులు తెలిపారు.

అక్కడ ఉన్న సత్యసాయి బాబా ఆశ్రమానికి ఫ్యాషన్ డిజైనర్.. సైకాలజిస్ట్ అయిన ఎలెనా బెకోవా అనే మహిళ గురువుగా వ్యవహరిస్తోంది. ఆమెను లోలా-లీల అని కూడా పిలుస్తారు. 2011లో ఆయన మరణం తర్వాత భక్తురాలినా మారిపోయానని బెకోవా చెప్పుకునేది. బెకోవా అక్కడి సత్యసాయి బాబా ఆశ్రమానికి వచ్చే వారికి చాలా బోధనలు నేర్పేది. అలాగే వారితో చాలా ఉపవాసదీక్షలు చేయించేదని ఎలెనా స్మొరోదినోవా స్నేహితులు తెలిపేవారు.

గతంలో కూడా ఎలెనా స్మొరోదినోవాతో చాలా సార్లు ఉపవాసదీక్షలు చేయించింది. తాజాగా అయితే ఏకంగా మూడు వారాల పాటూ ఉపవాస దీక్ష చేయమని ఎలెనా స్మొరోదినోవాతో బెకోవా చెప్పింది. ఈసారి దీక్షలో ఎలెనా స్మొరోదినోవా చాలా నీరసించిపోయింది. డీహైడ్రేషన్.. మాల్ న్యూట్రీషన్ కారణంగా ఎలెనా స్మొరోదినోవా మరణించింది. బెకోవాకావాలనే ఎలెనా స్మొరోదినోవాతో ఈ ఉపవాస దీక్షలు చేయించిందని ఆమె స్నేహితులు చెప్పారు. దీనిపై అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here