త‌ల‌పై దిగ‌బ‌డిన క‌త్తెర‌తో.. సిటీబ‌స్సులో వ‌చ్చిన ఆమెను చూసి.. విస్తుపోయిన డాక్ట‌ర్లు!

బీజింగ్‌: త‌ల మీద ఏదైనా వ‌స్తువు ప‌డితే మూర్ఛ‌పోతాం. బెంబేలెత్తి పోతాం. అలాంటిది ఏకంగా క‌త్తెర దిగ‌బ‌డిన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం తొణ‌క‌లేదు, బెణ‌క‌లేదా మ‌హిళ‌. ధైర్యాన్ని కూడదీసుకుంది. ఎంచక్కా, ఒంట‌రిగా సిటీ బ‌స్సెక్కి, ఆసుప‌త్రికి వెళ్లింది. వైద్యం చేయించుకుంది. ఆసుప‌త్రి ముందు సిటీ బ‌స్సు దిగి.. లోనికి వ‌స్తోన్న ఆమెను చూసి డాక్ట‌ర్లు, సిబ్బంది విస్తుపోయారు.

ఈ ఘ‌ట‌న చైనా హ్యూబె ప్రావిన్స్‌లోని గ్జిన్‌యాంగ్ సిటీలో చోటు చేసుకుంది. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ క‌త్తెర కూడా మామూలుది కాదు. గార్డెన్ క‌ట్టర్‌. తోట‌ల్లో చెట్ల‌ను ట్రిమ్ చేయ‌డానికి వినియోగించే క‌త్తెర అది.

షెన్ గ్జియాయోయింగ్ అనే మ‌హిళ గ్జిన్‌యాంగ్‌లోని త‌న నివాసంలో మొక్క‌లను ట్రిమ్ చేస్తూ, మ‌ధ్యలో ఆ క‌త్తెర‌ను ఓ వెదురు చెట్టుకు గుచ్చింది. ఆ చెట్టు కిందే కూర్చ‌ని పాదులు స‌రిచేస్తుండ‌గా.. ఆ క‌త్తెర జారి, ఆమె త‌ల‌పై ప‌డింది.

మొన తేలిన వైపు నుంచి క‌త్తెర ప‌డ‌టంతో..నేరుగా త‌ల‌లోకి గుచ్చుకుంది. ఈ ఘ‌ట‌న‌తో బెదిరిపోలేదామె. ఇంట్లో నుంచి బ‌య‌టికి వ‌చ్చి, బ‌స్‌స్టాప్‌కు వెళ్లి మ‌రీ సిటీ బ‌స్సెక్కి ఆసుప‌త్రికి వెళ్లింది. డాక్ట‌ర్లు ఆమెకు చికిత్స చేసి ఆ కత్తెరను తొలగించారు. ప్ర‌స్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here