చదివేది-ఎనిమిదో క్లాసు.. తాగేది-మందు.. పని- గొలుసులు లాక్కొని వెళ్ళడం..!

సరిగ్గా చదువుకోవాల్సిన వయసులో దారి తప్పితే ఇలాగే తయరవుతారు. ఎనిమిదో క్లాస్ కే అన్ని చెడు అలవాట్లకు బానిసైన ఆ కుర్రాళ్ళు.. ఏకంగా గొలుసులు లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో దొరికిపోవడంతో వారిని స్థానికులు ఉతికి ఆరేశారు.


ఈ ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే.. ఇద్దరు కుర్రాళ్ళు ఆమెను వెంబడించారు. అలా వెంబడిస్తూ వెంబడిస్తూ ఆమె గొలుసు లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆమె వారిని పట్టేసుకుంది. స్థానికులు కూడా ఆ కుర్రాళ్ళను పట్టేసుకున్నారు. పట్టుకొన్న తర్వాత వారిని చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి ఆ కుర్రాళ్ళ గురించి వాకబు చేయగా తాము ఎనిమిదో తరగతి చదువుతున్నామని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే ఆ కుర్రాళ్ళు అప్పటికే ఫుల్ గా తాగినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే తాము ఈ పని చేశామని పోలీసులకు చెప్పుకొచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. చదువుకోవాల్సిన వయసులో మరీ ఇన్ని చెడు అలవాట్లా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here