మహిళలకు శుభవార్త తెలిపిన సౌదీ ప్రభుత్వం..!

ఇప్పటివరకూ ఏ దేశ మహిళలు అయినా సౌదీ అరేబియాకు వెళ్ళాలంటే పక్కనే తండ్రినో, భర్తనో, సోదరుడినో తీసుకొని వెళ్ళాల్సి ఉండేది. అయితే ఆ నిబంధనలను సడలిస్తూ సౌదీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏ దేశ మహిళలు అయినా సరే.. 25 సంవత్సరాల పైబడి ఉన్నట్లయితే ఆనందంగా సౌదీకి రావచ్చని అధికారులు తెలిపారు. 25సంవత్సరాల పైబడిన మహిళలలు మగవారిని తోడు తీసుకొని రాకపోయినా కూడా టూరిస్ట్ వీసా ఇస్తామని సౌదీ కమీషన్ ఫర్ టూరిజమ్ అండ్ నేషనల్ హెరిటేజ్ అధికారులు తెలిపారు. ఇకపై మహిళలు తమ వెంట కుటుంబ సభ్యులను తీసుకొని రావాల్సిన అవసరం లేదని సూచించారు.

ఇక వయసు 25 కంటే తక్కువ ఉన్న మహిళలు మాత్రం కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ టూరిస్ట్ వీసా గడువు 30 రోజులు అని అధికారులు స్పష్టం చేశారు. 2018 మొదటి త్రైమాసికంలో ఈ వీసాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సౌదీ కమీషన్ ఫర్ టూరిజమ్ అండ్ నేషనల్ హెరిటేజ్ గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారా సౌదీ లోకి ప్రవేశించవచ్చు. సౌదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ద్వారా మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here